
హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో అవధ్ వారియర్స్‌కు హైదరాబాద్ హంటర్స్ షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో కొన్ని అద్భుతాలు చోటు చేసుకున్నాయి. అవధె వారియర్స్‌కు చెందిన సైనా నెహ్వాల్‌ను హైదరాబాద్ హంటర్స్‌కు చెందిన కరోలినా మారిన్ చిత్తుగా ఓడించింది.
మరోవైపు సాయి ప్రణీత్ చేతిలో కిదాంబి శ్రీకాంత్ ఓటమిపాలయ్యాడు. దీని ఫలితంగా పీబీఎల్‌లో హైదరాబాద్ హంటర్స్ 6-(-1)తో అవధ్ వారియర్స్‌ను ఓడించింది. తొలి మ్యాచ్‌లో భాగంగా పురుషుల డబుల్స్‌లో కిడో-సియోంగ్ (హైదరాబాద్) జోడి 14-15, 15-6, 15-11తో చున్‌మన్-చిన్‌చంగ్‌పై విజయం సాధించింది.
ఆ తర్వాత పురుషుల సింగిల్స్‌లో లీ హ్యున్ (హైదరాబాద్) 13-15, 15-9, 15-14తో కశ్యప్‌పై విజయం సాధించాడు. వారియర్స్ తమ ట్రంప్ మ్యాచ్‌గా ఎంచుకున్న పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌ను సాయిప్రణీత్ (హైదరాబాద్) ఓడించాడు. ప్రణీత్ 15-10, 15-10తో శ్రీకాంత్‌పై గెలిచి హైదరాబాద్‌కు విజయాన్ని ఖరారు చేశాడు.
ఇక, ఎంతో ఆసక్తి రేకెత్తించిన మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో హైదరాబాద్‌కు చెందిన ఒలింపిక్ చాంపియన్ కరోలినా మారిన్ 15-5, 15-7 స్కోరుతో సైనా నెహ్వాల్‌ను ఓడించింది. హైదరాబాద్‌కు ఇది ట్రంప్ మ్యాచ్ కావడంతో అవధె వారియర్స్ రెండు పాయింట్లు సాధించింది.
మరో పురుషుల సింగిల్స్‌లో లీ హ్యున్ 13-15, 15-9, 15-14తో పారుపల్లి కశ్య్‌పపై గెలుపొందాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో బెర్నాడెత్, రాంకిరెడ్డి (హైదరాబాద్) జోడి 15-9, 15-9తో సెటియావన్, పెడర్‌సెన్‌ను ఓడించింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.