For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పీబీఎల్ వేలం: సింధు.. సైనా.. శ్రీకాంత్‌లకు రూ.80లక్షలు!!

PBL 2018-19 auctions: Saina, Sindhu, Marin, Srikanth get Rs 8 million each

న్యూ ఢిల్లీ: బ్యాడ్మింటన్‌ ప్రేమికులను అలరించడానికి ప్రిమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) సిద్ధమైంది. డిసెంబరు నుంచే నాలుగో సీజన్‌. ఐతే అసలు పోటీలకు ముందు సోమవారం క్రీడాకారుల కోసం జరిగిన వేలంలో ఫ్రాంఛైజీల మధ్య పోటీ ఆసక్తి రేపింది. ఎవరూ ఊహించని విధంగా యువ షట్లర్‌ సాత్విక్‌ సాయిరాజ్‌కు రూ.52 లక్షలు పలకడం విశేషం. పీబీఎల్‌ డిసెంబరు 22న ముంబైలో ఆరంభమవుతుంది. జనవరి 13న బెంగళూరులో ఫైనల్‌ జరుగుతుంది.

వేలంలో 23 దేశాల నుంచి 145 మంది:

వేలంలో 23 దేశాల నుంచి 145 మంది:

మొత్తంగా 23 దేశాలకు చెందిన 145 మంది షట్లర్లను వేలంలో ఉంచారు. లీగ్‌లో క్రీడాకారులందరూ వేలంలో ఉండడం 2015 తర్వాత ఇదే తొలిసారి. రైట్‌ టు మ్యాచ్‌ (ఆర్‌టీఎం) కూడా లేదు. ఈ నేపథ్యంలో వేలం ఆసక్తికరంగా సాగింది. సరైన కూర్పు కోసం ఫ్రాంఛైజీలు తీవ్రంగా కసరత్తు చేశాయి. ఇండోనేసియాకు చెందిన టామీ సుగియార్తో ఢిల్లీ డాషర్స్‌ అతణ్ని రూ.70 లక్షలకు కొనుక్కుంది. ఇది అతడి కనీస ధర కంటే రూ.30 లక్షలు ఎక్కువ. దిగ్గజ క్రీడాకారులు సింధు, మారీన్‌ల కోసం ఊహించినట్లే ఫ్రాంఛైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి.

డ్రా ద్వారా జట్లకు సింధు, మారీన్‌లను

డ్రా ద్వారా జట్లకు సింధు, మారీన్‌లను

గరిష్టంగా రూ.80 లక్షలు చెల్లించడానికి వీలుండగా.. నాలుగు ఫ్రాంఛైజీలు వాళ్లకు ఆ మొత్తం ఇవ్వజూపాయి. దీంతో డ్రా ద్వారా సింధు, మారీన్‌లను జట్లకు కేటాయించారు. గతంలో హైదరాబాద్‌ హంటర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన మారీన్‌ ఈసారి పుణె 7 ఏసెస్‌కు వెళ్లింది. ఇంతకుముందు చెన్నైకి స్మాషర్స్‌కు ఆడిన సింధును ఈసారి హైదరాబాద్‌ హంటర్స్‌ దక్కించుకోగా...శ్రీకాంత్‌ను బెంగళూరు ర్యాఫ్టర్స్‌ సొంతం చేసుకుంది. శ్రీకాంత్‌ ఇంతకుముందు హైదరాబాద్‌కు ఆడాడు.

సైనా నెహ్వాల్‌ తొలి రౌండ్లో అమ్ముడుపోకపోవడం

సైనా నెహ్వాల్‌ తొలి రౌండ్లో అమ్ముడుపోకపోవడం

ప్రణయ్‌... ఢిల్లీ డాషర్స్‌కు వెళ్లిపోయాడు. గతంలో అవధె వారియర్స్‌కు ఆడిన సైనా నెహ్వాల్‌ ఇకపై నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. తొలి రౌండ్లో ఆమె అమ్ముడుపోకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ విక్టర్‌ అకెల్సన్‌ (రూ.80 లక్షలు)ను అహ్మదాబాద్‌ స్మాషర్స్‌, సన్‌ వాన హో (రూ.70 లక్షలు), అశ్విని పొన్నప్ప (రూ.32 లక్షలు)లను అవధె వారియర్స్‌, డెన్మార్క్‌ ఆటగాడు మథియాస్‌ బో (రూ.50 లక్షలు)ను కొత్త ఫ్రాంఛైజీ పుణె 7 ఏసెస్‌ కొన్నాయి.

18 ఏళ్ల సాత్విక్‌ సాయిరాజ్‌ రూ.15 లక్షలు

18 ఏళ్ల సాత్విక్‌ సాయిరాజ్‌ రూ.15 లక్షలు

వేలం మొత్తంలో సంచలన ధర పలికింది మాత్రం 18 ఏళ్ల సాత్విక్‌ సాయిరాజ్‌ రంకిరెడ్డికే. రూ.15 లక్షల కనీస ధర ఉన్న అతడు అనూహ్యంగా రూ.52 లక్షలకు అమ్ముడుపోయాడు. అహ్మదాబాద్‌ అతణ్ని సొంతం చేసుకుంది. అత్యధిక ధరకు అమ్ముడుపోయిన దిగ్గజేతర భారత షట్లర్‌గా సాత్విక్‌ నిలిచాడు. ఇంగ్లాండ్‌కు చెందిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ జంట క్రిస్‌ అడ్‌కాక్‌ (రూ.54 లక్షలు), గేబీ అడ్‌కాక్‌ (రూ.36 లక్షల)లను చెన్నై కొనుగోలు చేసింది.

ఇదే జట్టుకు ప్రపంచ నంబర్‌-9 సుంగ్‌ జి హ్యున్‌ (రూ.80 లక్షలు ) దిగ్గజ ఆటగాడిగా ఉంటాడు. కొరియా మిక్స్‌డ్‌ డబుల్స్‌ స్పెషలిస్ట్‌ యోమ్‌ హీ వొన్‌ (రూ.30 లక్షలు)ను హైదరాబాద్‌ చేజిక్కించుకుంది. మొత్తం 9 ఫ్రాంఛైజీల్లో వేలంలో రెండు జట్లు అవధె వారియర్స్‌, ముంబై రాకర్స్‌ మాత్రమే తమ మొత్తం సొమ్ము (రూ.2.6 కోట్లు)ను ఖర్చుచేశాయి.

Story first published: Tuesday, October 9, 2018, 10:31 [IST]
Other articles published on Oct 9, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+