పీబీఎల్: రాణించిన సైనా, సెమీస్‌కు అవధ్ వారియర్స్
హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ నేతృత్వంలోని అవధ్ వారియర్స్ అద్భుతంగా ఆడుతోంది. లీగ్ ఆరంభం నుంచి అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న సైనా నెహ్వాల్ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో అవధ్ వారియర్స్ 4-3తో బెంగళూరు బ్లాస్టర్స్‌ను చిత్తుచేసింది.
ఈ విజయంతో సైనా జట్టు ఓవరాల్‌గా 18 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో ఈ సీజన్‌లో సెమీపైనల్‌కు చేరిన తొలి జట్టుగా అవధ్ వారియర్స్ నిలిచింది. 16 పాయింట్లతో ముంబై రాకెట్స్ రెండోస్థానంలో కొనసాగుతుండగా, బెంగళూరు బ్లాస్టర్స్ 11 పాయింట్లతో మూడోస్థానంలో ఉంది.

సెమీస్‌కు అర్హత సాధించిన అవధ్ వారియర్స్
ఇక రియో ఒలింపిక్స్ పతక విజేత పీవీ సింధు నేతృత్వంలోని చెన్నై స్మాషర్స్ జట్టు 10 పాయింట్లతో నాలుగోస్థానంలో నిలిచింది. కీలకమైన ట్రంప్ మ్యాచ్‌లలో అవధ్ వారియర్స్ జట్టు గెలవడంతో సెమీస్‌కు అర్హత సాధించింది. సోమవారం తొలుత జరిగిన పురుషుల సింగిల్స్‌లో సౌరభ్ వర్మ 13-11, 11-7తో విన్సెంట్ వాంగ్ వింగ్‌పై గెలిచి బెంగళూరుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు.

పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో శ్రీకాంత్ విజయం
ఆ తర్వాత జరిగిన మూడు మ్యాచ్‌ల్లో కూడా అవధ్ వారియర్స్ జట్టు సభ్యులే గెలిచారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో అవధే జోడీ సావిత్రి-ఇసారా జోడీ 11-9, 4-11, 11-5తో సిక్కి రెడ్డి- కో సంగ్ జంటను ఓడించడంతో ఇరుజట్లు 1-1తో సమంగా నిలిచాయి. ఇక రెండో పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో శ్రీకాంత్ (వారియర్స్) 11-9, 11-9తో విక్టర్ అక్సెల్సన్ (బ్లాస్టర్స్)పై విజయం సాధించాడు.

ట్రంప్ మ్యాచ్‌గా మహిళల సింగిల్స్ పోరు
అనంతరం మహిళల సింగిల్స్ పోరును అవధ్ తమ ట్రంప్ మ్యాచ్‌గా ఎంచుకుంది. ఇందులో సైనా నెహ్వాల్ 9-11, 11-5, 11-5తోచుయెంగ్ గాన్ యిపై నెగ్గింది. దీంతో బోనస్ పాయింట్‌తో మరో మ్యాచ్ మిగిలుండగానే అవధ్ వారియర్స్‌కు జట్టుకు విజయాన్ని ఖాయమైంది.

ముంబై రాకెట్స్‌తో తలపడనున్న చెన్నై స్మాషర్స్
ఇక చివరిదైన పురుషుల డబుల్స్ ట్రంప్ మ్యాచ్‌లో బెంగళూరు జోడీ కో సంగ్-యెన్ సియోంగ్ 6-11, 11-9, 11-6తో అవధే జంట గో షెమ్-మార్కిస్ కిడోను ఓడించినా ఫలితం లేకపోయింది. ఈ మ్యాచ్‌తో బెంగళూరు ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి. మంగళవారం బెంగళూరులోనే జరిగే మ్యాచ్‌లో ముంబై రాకెట్స్‌తో చెన్నై స్మాషర్స్ తలపడుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications