PBL 2 వేలం నేడు: దృష్టంతా మారిన్, సింధు, సైనాలపైనే
హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) రెండో సీజన్‌కు సన్నాహాలు మొదలయయ్యాయి. పీబీఎల్ రెండో సీజన్ వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 14వరకు జరుగనుంది. ఈ లీగ్‌లో ఆడేందుకు గాను 16 మంది ఒలింపిక్ పతక విజేతలతో పాటు పలువురు అంతర్జాతీయ స్టార్ షట్లర్లు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు.
దీంతో ఈ లీగ్‌కు సంబంధించి క్రీడాకారుల వేలం బుధవారం జరుగుతుంది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు ఉంటాయి. రియో ఒలింపిక్స్‌లో ఛాంపియన్‌గా నిలిచిన స్పెయిన్ సంచలనం కరోలినా మారిన్, పీవీ సింధు, భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌తో పాటు రియో ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్‌లో కాంస్యం నెగ్గిన విక్టర్ అక్సెల్‌సన్ (డెన్మార్క్)లు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నారు.

తొలి సీజన్‌లో విజేతగా ఢిల్లీ ఏసర్స్
మొత్తం ఆరు జట్లు ఢిల్లీ ఏసర్స్, ముంబై రాకెట్స్, చెన్నై స్మాషర్స్, హైదరాబాద్ హంటర్స్, అవధ్ వారియర్స్, బెంగళూరు బ్లాస్టర్స్ టైటిల్ కోసం తలపడతాయి. ఈ ఏడాది జనవరిలో జరిగిన పీబీఎల్ తొలి సీజన్‌లో ఢిల్లీ ఏసర్స్ విజేతగా నిలిచింది. వేలంలో భాగంగా ఒక్కో జట్టుకు ముగ్గురు ఆటగాళ్లను తమ వద్దే ఉంచుకోవడానికి వెసులుబాటు కల్పించారు.

చెన్నై స్మాషర్స్‌కు సింధు, అవధ్ వారియర్స్‌కు సైనా
తొలి సీజన్‌లో పీవీ సింధు చెన్నై స్మాషర్స్ జట్టుకు, సైనా నెహ్వాల్ అవధ్ వారియర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. ఆటగాళ్ల వేలంలో భాగంగా ప్రతి ఫ్రాంఛైజీ జట్టు కోసం రూ 1.93 కోట్లు ఖర్చు చేయనుంది. రెండు వారాల పాటు జరిగే ఈ లీగ్ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 6 కోట్లుగా ఉంది.

కరోలిన్ మారిన్, సింధులకు అత్యధిక ధర
రెండో సీజన్ కోసం జరుగుతున్న వేలంపాటలో ప్రధానంగా ప్రపంచ నంబర్‌వన్ కరోలిన్ మారిన్, భారత ఫేవరెట్ సింధుల కోసం ఫ్రాంచైజీలు అత్యధిక ధర వెచ్చించే అవకాశముంది. ఇక భారత బ్యాడ్మింటన్ స్టార్ మహిళల జోడీ గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప విడిపోయారు. బ్రెజిల్‌లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో ఈ జోడీ కలిసి ఆడింది.

విడిపోయిన గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప
అయితే తాను మిక్స్‌డ్ డబుల్స్‌పై దృష్టి సారించేందుకే మను అత్రితో ఆడనునున్నట్లు గుత్తా జ్వాల చెప్పింది. మరోవైపు అశ్విని కూడా సిక్కిరెడ్డిని తన డబుల్స్ భాగస్వామిగా ఎంచుకుంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలిచిన ఈ జోడీ 2010లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకాన్ని నెగ్గిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications