Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫోటోలు: మారిన్ చేతిలో సింధు ఓటమి, ఫ్యాషన్‌తో అదరగొట్టారు

హైదరాబాద్: పీబీఎల్‌ రెండో సీజన్‌లో హైదరాబాద్‌ హంటర్స్‌ శుభారంభం చేసింది. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో రియో ఒలింపిక్ చాంపియన్ కరోలినా మారిన్ సారథ్యంలోని హైదరాబాద్ హంటర్స్‌ 4-3తో పీవీ సింధు నేతృత్వంలోని చెన్నై స్మాషర్స్‌పై విజయం సాధించింది.

తొలి మ్యాచ్‌లోనే వరల్డ్ మాజీ ఛాంపియన్ కరోలినా మారిన్‌ 11-8, 12-14, 11-2తో చెన్నై ప్లేయర్‌ పీవీ సింధుపై ఘన విజయం సాధించి లీగ్‌ను ఘనంగా ఆరంభించింది. దీంతో ఆతిథ్య హైదరాబాద్ జట్టు 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఒలింపిక్ ఫైనలిస్టులైన మారిన్‌, సింధు మధ్య జరిగిన మ్యాచ్‌లో చివరకు మారిన్‌దే పైచేయి అయింది.

మారిన్‌పై సింధు పైచేయి

మారిన్‌పై సింధు పైచేయి

ఒలింపిక్స్‌ ఫైనల్లో సింధుపై మారిన్‌ నెగ్గగా బీడబ్ల్యూఎఫ్‌ సూపర్‌ సిరీస్‌లో మారిన్‌పై సింధు పైచేయి సాధించింది. ఇక ఒలింపిక్స్‌ ఫైనల్లో సింధుపై మారిన్‌ నెగ్గగా.. బీడబ్ల్యూఎఫ్‌ సూపర్‌ సిరీస్‌లో మారిన్‌పై సింధు పైచేయి సాధించింది. 39 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో మారిన్‌ అనుభవంలో, ర్యాంకింగ్స్‌లో మారిన్‌కు విజయం చేకూర్చడంలో ఎంతగానో దోహదపడ్డాయి. నెట్‌ వద్ద మంచి డ్రాప్‌ షాట్‌తో మారిన్‌ ఖాతా తెరువగా సింధు వెంటనే స్కోరు సమం చేసింది.

9-6తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన మారిన్

9-6తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన మారిన్

ఆ తర్వాత ఇద్దరూ ఒక్కో పాయింట్‌ కోసం తీవ్రంగా పోటీ పడడంతో 4-4తో స్కోరు సమమైంది. ఈ దశలో విజృంభించిన మారిన్‌ 9-6తో ఆధిక్యంలోకి వెళ్లింది. సింధు పోటీ ఇచ్చే ప్రయత్నం చేసినా మారిన్‌ వెంటనే 10-8తో గేమ్‌ పాయింట్‌పై నిలిచింది. తొలి సెట్‌లో మారిన్‌ కోర్టులో చాలా ప్రశాంతంగా కనిపించగా ఒత్తిడికి గురై సింధు తొలి సెట్‌ను కోల్పోయింది. ఇక రెండో సెట్‌లో సింధు గొప్పగా ఆడింది.

అనూహ్యంగా విజృంభించిన సింధు

అనూహ్యంగా విజృంభించిన సింధు

పదునైన షాట్లతో ఎదురుదాడి చేసి 5-2తో ముందంజ వేయడంతో సులభంగా మ్యాచ్‌ నెగ్గేలా కనిపించింది. కానీ, అనూహ్యంగా విజృంభించిన సింధు వరుసగా ఐదు పాయింట్లతో 7-5తో నిలిచింది. ప్రత్యర్థికి అవకాశం ఇవ్వని మారిన్ వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 9-7తో ఆధిక్యం సాధించింది. అదే సమయంలో మారిన్ నుంచి ఎదురైన సవాళ్లను సమర్థంగా ఎదుర్కొని, ఆ సెట్‌ను తన ఖాతాలో వేసుకుంది.

మూడో సెట్‌లో సింధుకు మారిన్ చుక్కలు

మూడో సెట్‌లో సింధుకు మారిన్ చుక్కలు

దీంతో కీలకంగా మారిన మూడో సెట్‌లో సింధుకు మారిన్ చుక్కలు చూపించింది. కోర్టు నలుమూలలా షాట్లు కొడుతూ సింధుని ఉక్కిరిబిక్కిరి చేసిన కరోలినా 5-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇదే జోరుతో మూడో సెట్‌ను కైవసం చేసుకుని మ్యాచ్‌ని కూడా సొంతం చేసుకుంది. దీంతో, తొలి సీజన్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ ఓడని సింధు విజయయాత్రకు మారిన్ బ్రేక్‌ వేసింది.

మిక్స్‌డ్ డబుల్స్‌లో చెన్నై జోడీ విజయం

మిక్స్‌డ్ డబుల్స్‌లో చెన్నై జోడీ విజయం

ఇక ఆ తర్వాత జరిగిన మిక్స్‌డ్ డబుల్స్‌లో చెన్నై జోడీ క్రిస్-గాబ్బీ అడ్‌కాక్ గెలవడం, దీన్ని చెన్నై ట్రంప్ మ్యాచ్‌గా గుర్తించడంతో బోనస్ పాయింట్ దక్కింది. ఫలితంగా చెన్నై ఆధిక్యం 3-1కి పెరిగింది. ఇక పురుషుల రెండో సింగిల్స్‌లో రాజీవ్ ఉసెఫ్ (హైదరాబాద్) 11-6, 11-8, 11-6తో తనోంగ్‌సాక్ సెన్‌సోంబూన్‌సుక్ (చెన్నై)పై గెలిచి ప్రత్యర్థి జట్టు ఆధిక్యాన్ని 2-3కు తగ్గించాడు.

హైదరాబాద్‌కు చిరస్మరణీయ విజయం

హైదరాబాద్‌కు చిరస్మరణీయ విజయం

ఇక పురుషుల డబుల్స్‌ను ట్రంప్ మ్యాచ్‌గా గుర్తించిన హైదరాబాద్ బూన్ హీయోంగ్ టాన్-వీ కియోంగ్‌లను బరిలోకి దించింది. ఈ జోడి 11-7, 11-8తో సుమీత్ రెడ్డి-పీటర్ కోల్డింగ్ (చెన్నై)పై నెగ్గి హైదరాబాద్‌కు 4-3తో చిరస్మరణీయ విజయాన్ని అందించింది. అంతకుముందు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమం ఆహాతులను ఆకట్టుకుంది.

సంప్రదాయ దుస్తుల్లో క్రీడాకారిణిలు

సంప్రదాయ దుస్తుల్లో క్రీడాకారిణిలు

ఆటపాటలతో పాటు సంప్రదాయ దుస్తుల్లో క్రీడాకారిణిలు మెరిసిపోయారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహాన్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, క్రీడల మంత్రి పద్మారావు, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, భారత (బాయ్) అధ్యక్షుడు అఖిలేశ్ దాస్ గుప్తా, చీఫ్ కోచ్ గోపీచంద్ పాల్గొన్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+