రియోలో పీవీ సింధు ఎఫెక్ట్: '20వ శతాబ్దం మహిళలదే'
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు బంగారు పతకంతో తిరిగి రావాలని కేంద్రమంత్రి, బిజెపి నాయకురాలు ఉమా భారతి ఆకాంక్షించారు. కుస్తీ పోటీల్లో కాంస్య పతకం సాధించిన సాక్షి మాలిక్‌ను ఉమా భారతి అభినందించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు.
21వ శతాబ్దం భారతీయ మహిళలదే అన్నారు. రియో ఒలింపిక్స్‌లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. సాక్షి మాలిక్ కాంస్య పతకం సాధించారని, ఇప్పుడు సింధు ఫైనల్‌కు చేరుకుందని, ఆమె బంగారు పతకం గెలవాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు.

కాగా, భారత్ ఆటగాళ్ల పైన వివాదాస్పద కామెంట్లు చేసిన శోభా డేకు సాక్షి మాలిక్ కాంస్యం సాధించడం ద్వారా క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కౌంటర్ ఇస్తే, పీవీ సింధు ఫైనల్‌కు వెళ్లడంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కౌంటర్ ఇచ్చారు. పీవీ సింధు ఖాళీ చేతులతో తిరిగి రావడం లేదని, పతకంతో వస్తుందని ధైర్యం నింపారు. పీవీ సింధు సిల్వర్‌కు పరిమితం అవుతుందని అభిప్రాయపడ్డ విషయం తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications