Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఢిల్లీ సన్మానం ఊహించలేదు: ఏపీ భవన్‌లో సింధు, శ్రీకాంత్

హైదరాబాద్: ఢిల్లీలో సన్మానం అందుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఇది మరిచిపోలేని అనుభూతిని కలిగించిందని భారత బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్‌ పేర్కొన్నాడు. బుధవారం నుంచి ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో భాగంగా న్యూఢిల్లీలో మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.

ఏపీ భవన్‌లో సింధు, శ్రీకాంత్‌కు ఘన సన్మానం

ఏపీ భవన్‌లో సింధు, శ్రీకాంత్‌కు ఘన సన్మానం

ఇందులో భాగంగా పీవీ సింధు (చెన్నై స్మాషర్స్‌), శ్రీకాంత్‌ (అవధ్‌ వారియర్స్‌) ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా 2017లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన శ్రీకాంత్‌తో పాటు రియో ఒలింపిక్స్‌ రజత పతక విజేత పీవీ సింధును ఏపీ ప్రభుత్వం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఘనంగా సన్మానించింది. సింధు, శ్రీకాంత్‌లకు ఏపీభవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ బొబ్బిలి వీణలను బహూకరించి శాలువాతో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ అద్భుత ప్రదర్శనతో భారత ఖ్యాతిని పెంచుతున్న సింధు, శ్రీకాంత్‌లు దేశానికి గర్వకారణం అని ప్రవీణ్‌ ప్రకాశ్‌ అన్నారు.

ఢిల్లీలో తెలుగువారి సన్మానం ఊహించలేదు

ఢిల్లీలో తెలుగువారి సన్మానం ఊహించలేదు

ఈ సందర్భంగా పివీ సింధు మాట్లాడుతూ ఢిల్లీలో తెలుగువారి సన్మానం ఊహించలేదని, తనను సన్మానించినందుకు కృతజ్ఞతలు తెలిపింది. కాగా, కోర్టు ఉపరితలం నుంచి 1.15 మీటర్ల కంటే తక్కువ ఎత్తులోనే సర్వీస్‌ చేయాలన్న ప్రయోగాత్మక నిబంధనను ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలో కాకుండా మరెప్పుడైనా ప్రవేశ పెడితే బాగుండేదని సింధు తెలిపారు.

కొత్త నిబంధనపై పీవీ సింధు ఇలా

కొత్త నిబంధనపై పీవీ సింధు ఇలా

అయితే సాధన చేస్తే తాజా నిబంధన తనకేమంత ఇబ్బంది కాదని తెలిపారు. ఇక, ముఖ్య ఆటగాళ్లంతా వచ్చే ఏడాది నుంచి తప్పనిసరిగా 12 టోర్నీల్లో పాల్గొనాలన్న నిబంధనపై ఇప్పటికే షెడ్యూల్‌ వచ్చేసిందని, ఆడకుండా దాని గురించి చెప్పలేమని తెలిపారు. తాను మాత్రం కోచ్‌తో చర్చించి ఎంపిక చేసిన టోర్నీల్లో పాల్గొనాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

పతకాలు గెలువాలంటే పూర్తి ఫిట్‌నెస్ ఉండాలి

పతకాలు గెలువాలంటే పూర్తి ఫిట్‌నెస్ ఉండాలి

కిదాంబి శ్రీకాంత్ మాట్లాడుతూ వచ్చే ఏడాది విరామం లేని షెడ్యూల్ మధ్య టోర్నీలు జరుగనున్నాయని, పతకాలు గెలువాలంటే పూర్తి ఫిట్‌నెస్ ఉండాల్సిందేనని అన్నాడు. ఈ ఏడాది ఎంతో గొప్పగా సాగిందని, వచ్చే ఏడాది సూపర్‌సిరీస్‌ టోర్నీలతోపాటు కామన్వెల్త్‌ క్రీడలు, ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో పాల్గొనాల్సి ఉందని అన్నాడు. అంతకుముందు ఏపీ భవన్‌లోని బ్యాడ్మింటన్‌ కోర్టులో సింధు, శ్రీకాంత్‌లు కాసేపు షటిల్‌ ఆడి సందడి చేశారు.

Story first published: Wednesday, December 27, 2017, 11:01 [IST]
Other articles published on Dec 27, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+