
హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎ ల్)లో శుక్రవారం జనవరి 6న బెంగుళూరు బ్లాస్టర్స్‌కు నార్త్ ఈస్టర్న్ వారియర్స్‌కు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో వరుస విజయాలతో జోరుమీదున్న బెంగళూరు బ్లాస్టర్స్‌కు షాక్ తగిలింది. నార్త్ ఈస్టర్న్ వారియర్స్ జట్టు 3-2 ఆధిక్యంతో బెంగళూరు బ్లాస్టర్స్‌పై గెలిచింది.
తొలుత పురుషుల డబుల్స్ మ్యాచ్ బెంగళూరు సొంతమైంది. తర్వాత జరిగిన బెంగళూరు ట్రంప్ మ్యాచ్ పురుషుల సింగిల్స్‌లో వారియర్స్ ఆటగాడు జయరామ్ నెగ్గాడు.
మహిళల సింగిల్స్ (వారియర్స్ ట్రంప్ మ్యా చ్)లో మిచెల్లీ నెగ్గి వారియర్స్ ఆధిక్యాన్ని 3-0కు పెంచింది. తర్వాత పురుషుల సింగిల్స్, మిక్స్‌డ్ డబుల్స్ బెంగళూరు మళ్లీ గెలిచినా ఫలితం లేకపోయింది. అప్పటికే ట్రంప్ మ్యాచ్ కోల్పోయిన కారణంగా బెంగళూరు అతి తక్కువ స్కోరు 2 పాయింట్లకే పరిమితమై ఓడిపోయింది.
మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌లో బెంగుళూరు జట్టుకు చెందిన మను అత్రి, సిక్కిరెడ్డిలు ప్రత్యర్థులైన ప్రజక్ల సవాంత్, షిన్ బేక్ చీల్‌లతో 12-15, 15-8, 15-9 తేడాతో ఓడిపోయారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.