Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

న్యూస్‌మేకర్ 2017: బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు

Newsmakers 2017: Badminton: PV Sindhu

హైదరాబాద్: ఈ ఏడాది పీవీ సింధు అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చింది. అంతేకాదు ప్రపంచ బ్యాడ్మింటన్‌లో భారత షట్లర్లు తమ హావాని కొనసాగించారు. గతేడాది జరిగిన రియో ఒలింపిక్స్‌లో స్పెయిన్‌కు చెందిన కరోలినా మారన్ చేతిలో ఓటమిపాలైన పీవీ సింధు... అందుకు తగ్గ ప్రతీకారాన్ని ఈ ఏడాది జరిగిన ఇండియన్ ఓపెన్ ఫైనల్లో తీర్చుకుంది.

ఈ ఏడాది ఆరంభంలో వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలిచిన సింధు ఆ తర్వాత ఇండియా ఓపెన్‌, కొరియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టైటిళ్లను సాధించింది. గతేడాది తొలిసారిగా బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌ ఆడింది సింధు ఆ టోర్నీలో సెమీస్‌ దగ్గర ఆగిపోయింది. కానీ ఈసారి సెమీస్‌ను అధిగమించి ఫైనల్స్‌కు చేరుకుంది.

సైనా నెహ్వాల్‌ (2011) తర్వాత బీడబ్ల్యూఎఫ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌లో సింగిల్స్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించిన క్రీడాకారిణిగా సింధు అరుదైన ఘనత సాధించింది. టోర్నీ సాంతం అద్భుత ప్రదర్శన చేసిన పీవీ సింధు ఉత్కంఠగా సాగిన ఫైనల్లో జపాన్‌ క్రీడాకారిణి యమగూచి చేతిలో ఓటమి ఓడిపోయింది. 93 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సింధు 21-15, 12-21, 19-21 తేడాతో ఓటమి పాలైంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, December 19, 2017, 17:20 [IST]
Other articles published on Dec 19, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+