
హైదరాబాద్: కొన్ని సంవత్సరాలుగా భారత్‌లో బ్యాడ్మింటన్ అంటే మహిళలే కనబడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఒకే ఒక్క పురుషుడు కిదాండి శ్రీకాంత్ కొన్ని సంవత్సరాలుగా వారితోపాటుగా ఆడుతూ వార్తల్లో ఉంటున్నాడు.
ఈ 2017సంవత్సరం శ్రీకాంత్ కెరీర్‌లోనే గుర్తుండిపోయే సంవత్సరం. ఈ ఏడాది శ్రీకాంత్ అంతకుముందు లేనన్ని విజయాలను సొంతం చేసుకున్నాడు. సంవత్సర ఆరంభంలో సూపర్ సిరీస్ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి భారతీయుడిగా రికార్డులకెక్కాడు.
తన కాలికి దెబ్బ తగలడంతో విరామం తీసుకున్నాడు. తిరిగొచ్చాక ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌లో పాల్గొన్నాడు. ఈ టైటిల్ గెలుచుకోవడంతో ఇప్పటి వరకు భారతీయులే నాలుగు సార్లు గెలిచిన చరిత్ర సృష్గించాడు. డెన్మార్క్ ఓపెన్ టైటిల్‌ను, ఇండోనేషియన్ టైటిల్‌ను, ఆస్ట్రేలియా ఓపెన్ను గెలిచి చరిత్ర సృష్టించాడు. తన జీవితంలోనే గుర్తుండిపోయే టైటిళ్లన్నీ ఈ ఏడాదే గెలుచుకున్నాడు.
ఈ ఘనత అతన్ని నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు గెలుచుకున్న మొట్ట మొదటి భారతీయుడిగా నిలబెట్టింది. ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి మూడో ప్రపంచ స్థాయి ఆటగాడి ర్యాంకును పొందాడు. దుబాయ్ సూపర్ సిరీస్‌లో పాల్గొన్న శ్రీకాంత్ ప్రపంచ స్థాయిలో మొట్ట మొదటి ర్యాంకు ఉన్న క్రీడాకారుడితో పోటీపడి వెనుదిరగాల్సి వచ్చింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.