For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

న్యూజిలాండ్ ఓపెన్: 212 ర్యాంకర్ చేతిలో ఓడిన సైనా నెహ్వాల్

New Zealand Open: Saina Nehwal Stunned by World No.212 in First Round

హైదరాబాద్: న్యూజిలాండ్ ఓపెన్‌లో భారత స్టార్‌ షట్లర్ సైనా నెహ్వాల్‌కు ఊహించని షాక్ తగిలింది. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో చైనాకు చెందిన వరల్డ్‌ నెంబర్ 212వ ర్యాంకర్ వాంగ్‌ జియి చేతిలో సైనా చిత్తుగా ఓటమిపాలైంది. 67 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ 16-21, 23-21, 4-21 తేడాతో ఓడింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

19 ఏళ్ల వాంగ్‌ జియి తొలి గేమ్‌లోనే సైనాపై ఆధిపత్యం ప్రదర్శించింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడి 21-16 తేడాతో తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. ఇక, రెండో గేమ్‌లో కూడా వాంగ్‌ జియి దూకుడుగా ఆడినప్పటికీ, సైనా తన అనుభవంతో గేమ్‌ను సొంతం చేసుకుంది. ఒకానొక దశలో 19-19 పాయింట్ల వద్ద ఇద్దరూ సమం అయ్యారు.

ఈ క్రమంలో సైనా తన అనుభవంతో నాలుగు పాయింట్లు సాధించి రెండో గేమ్‌ను సొంతం చేసుకుంది. ఇక, నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సైనా అనవసర తప్పిదాలకు పాల్పడి మూల్యం చెల్లించుకుంది. మూడో గేమ్‌లో సైనా కేవలం 4 పాయింట్లే సాధించడంతో 2-1తేడాతో వాంగ్‌ జియి మ్యాచ్‌ని సొంతం చేసుకుంది.

రెండో రౌండ్‌కు హెచ్‌ఎస్ ప్రణయ్, సాయి ప్రణీత్
మరోవైపు భారత పురుష షట్లర్లు హెచ్‌ఎస్ ప్రణయ్, సాయి ప్రణీత్ రెండో రౌండ్‌కు చేరుకున్నారు. తొలి రౌండ్‌లో హెచ్ఎస్ ప్రణయ్ ఇండోనేషియాకు చెందిన లోహ్ కీన్ యుపై 21-15, 21-14 తేడాతో అలవోక విజయాన్ని నమోదు చేయగా... సాయి ప్రణీత్ భారత్‌కు చెందిన శుభాంకర్ దుబేపై 21-17, 19-21, 21-15తేడాతో విజయం సాధించాడు. సాయి ప్రణీత్ రౌండ్ రౌండ్‌లో లిన్ డాన్‌తో తలపడనున్నాడు.

Story first published: Wednesday, May 1, 2019, 18:31 [IST]
Other articles published on May 1, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+