National badminton: సెమీస్‌లో సింధు, క్వార్టర్స్‌లో సైనా

హైదరాబాద్: గౌహతి వేదికగా జరుగుతున్న సీనియర్ జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పీవీ సింధు సెమీస్‌కు దూసుకెళ్లగా.. మరో ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ క్వార్టర్స్‌కు చేరుకుంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో సింధు 21-16, 21-7తో రియా ముఖర్జీని చిత్తుగా ఓడించింది. తొలి గేమ్‌లో రియా కొంత మేర పోరాడినా.. రెండో గేమ్‌లో మాత్రం టాప్ సీడ్ సింధు ధాటికి నిలవలేక పోయింది. ప్రీ క్వార్టర్స్, రౌండ్-8 మ్యాచ్‌లను సింధు ఒక్కరోజే ఆడటం విశేషం.

ఫైనల్ బెర్తు కోసం అస్మితతో తలపడనున్న సింధు
అంతకుముందు జరిగిన ప్రీ క్వార్టర్స్‌లో సింధు 21-11, 21-13 తో మాల్వికా భన్సోడ్‌ను ఓడించింది. ఫైనల్ బెర్తు కోసం అస్మితతో సింధు తలపడనుంది. ఇతర క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో వైష్ణవి 19-21, 22-20, 21-11తో శ్రియాన్సీ పరదేశిపై, అస్మిత 6-21, 21-17, 21-19తో ఆకర్షి కశ్యప్‌పై నెగ్గారు.

అభ్యంతరం వ్యక్తం చేసిన సైనా
కోర్టు ఉపరితలం బాలేదంటూ అభ్యంతరం వ్యక్తం చేసిన రెండో సీడ్ సైనా నెహ్వాల్ ఆలస్యంగా బరిలోకి దిగింది. రౌండ్-16లో సైనా 21-11, 21-10తో శ్రుతి ముండాడపై విజయం సాధించి క్వార్టర్స్‌లో ప్రవేశించింది. క్వార్టర్స్‌లో సైనా... నేహా పండిట్‌తో తలపడనుంది. పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ సమీర్‌వర్మ కాలి మడమ గాయంతో ప్రిక్వార్టర్స్ మ్యాచ్ నుంచి అర్ధంతరంగా తప్పుకోవడంతో 21-16, 1-8తో ఆర్యమన్ టాండన్ విజేతగా నిలిచాడు.

క్వార్టర్స్ చేరుకున్న సౌరభ్‌వర్మ, లక్ష్య సేన్
పురుషుల సింగిల్స్‌లో సౌరభ్‌వర్మ, లక్ష్య సేన్ క్వార్టర్స్ చేరుకున్నారు. కౌశల్ 21-11, 21-19తో క్వాలిఫయర్ హర్షీల్ ధనిపై నెగ్గాడు. మాజీ చాంపియన్ సౌరభ్ వర్మ, బోధిత్ జోషి కూడా క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు. డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో టాప్ సీడ్ అర్జున్-శ్లోక్ రామచంద్రన్, రూ పేష్ కుమార్, సన్యమ్ శుక్లా, కృష్ణ ప్రసాద్ జంటలు సెమీస్‌కు చేరుకున్నాయి.

పలు మ్యాచ్‌లు వాయిదా
అంతకుముందు కోర్టు ఉపరితలం సరిగా లేకపోవడంతో సైనా నెహ్వాల్ మ్యాచ్‌తో సహా సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్ మ్యాచ్‌లను కూడా వాయిదా వేశారు. నిర్వాహకులు కోర్టును పునరుద్ధరించిన తర్వాత మ్యాచ్‌లను కొనసాగించడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications