For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చైనా ఓపెన్: సెమీస్‌లోకి సింధు, ఓటమి పాలైన జయరాం

చైనా ఓపెన్ టోర్నీలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సెమీస్‌లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్‌ సింధు 22-20, 21-10తో బింగ్‌జియావొ (చైనా)పై విజయం సాధిం

By Nageshwara Rao

హైదరాబాద్: చైనా సూపర్‌ సిరీస్‌ ప్రిమియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సెమీస్‌లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్‌ సింధు 22-20, 21-10తో బింగ్‌జియావొ (చైనా)పై విజయం సాధించింది.

ఈ సీజన్‌లో వరుసగా నాలుగు టైటిల్స్ (బిట్ బర్గర్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, జపాన్ ఓపెన్, స్విస్ ఓపెన్) సాధించి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న హీ బింగ్‌జియావోను ఓడించింది. ఇటీవల జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్లో తనను ఓడించిన ఆమెపై ప్రతీకారం కూడా తీర్చుకుంది.

China Open: PV Sindhu advances to semis, Ajay Jayaram's journey ends

తొలి సెట్‌లో ఒకదశలో 1-5తో, 14-17తో వెనుకబడిన సింధు నెమ్మదిగా తేరుకొని ప్రత్యర్థి గట్టిపోటీ ఇవ్వడంతో గేమ్‌ నువ్వానేనా అన్నట్లు సాగింది. దీంతో తుదకు 20-20తో స్కోరును సమం చేసింది. ఆ తర్వాత వరుసగా రెండు పాయింట్లు సాధించిన తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది.

ఇక రెండో గేమ్‌లో సింధు పూర్తి ఆధిక్యతను ప్రదర్శిచింది. ఆరంభంలో 7-3తో ముందంజలో ఉన్న సింధు ఆ తర్వాత నిలకడగా పారుుంట్లు సాధించి 14-5తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత 21-10తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను గెలుచుకుంది. శనివారం జరిగే సెమీఫైనల్లో సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)తో సింధు తలపడనుంది.

ఈ విజయంతో బింగ్‌జియావొ (చైనా)తో తలపడిన ముఖాముఖి రికార్డులో సింధు 5-3తో ఆధిక్యంలో ఉంది. ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో అజయ్ జయరామ్ పోరాటం ముగిసింది. ఒలింపిక్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో జయరామ్ 15-21, 14-21తో రెండో సీడ్‌ చెన్‌ లాంగ్‌ (చైనా) చేతిలో పరాజయం పాలయ్యాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+