టోక్యో: ఎవరైనా కాస్త తలతిక్కగా ప్రవర్తిస్తే.. కోతిలా చేయకు అని విసుక్కోవడం కామన్. కానీ కోతులు కూడా చాలా పద్దతిగా ఉంటాయండోయ్. వాటికి సరైన గైడెన్స్ ఇవ్వాలే గానీ టాలెంట్ లో మనల్ని మించిపోయిన ఆశ్చర్యపోనవసరం లేదేమో!
తాజాగా యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తున్న ఈ వీడియోను చూస్తే.. పై వ్యాఖ్యలు నిజమేనని అనిపించకమానదు. జపాన్ కు చెందిన రిక్కీ అనే కోతి టెన్నిస్ రాకెట్ చేతబట్టి బ్యాడ్మింటన్ ఆడుతున్న వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అచ్చు మనుషుల్లాగే టెన్నిస్ రాకెట్ తో భలే షాట్స్ ఆడుతోంది.
రిక్కీ పేరుతో యూట్యూబ్ లో చానెల్ ఓపెన్ చేసిన దాని కోచ్.. బ్యాడ్మింటన్ సహా పలు వీడియోలు అందులో అప్ లోడ్ చేశాడు. దీంతో చాలామంది యూట్యూబ్ లో రిక్కీని ఫాలో అవుతున్నారు.