'పతకాలు కాదు కావాల్సింది.. ప్రదర్శన ముఖ్యం'

హైదరాబాద్: ప్రస్తుత సంవత్సరంలో భారత బ్యాడ్మింటన్‌కు కలిసి రాలేదని జాతీయ బ్యాడ్మింటన్ ఛీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తెలిపాడు. ఇటువంటి కఠిన పరిస్థితుల్లోనూ భారత క్రీడాకారుల ప్రదర్శన సంతృప్తికరంగా ఉందని పేర్కొన్నాడు. ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత ప్లేయర్లు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారని కితాబిచ్చారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కార్యక్రమానికి హాజరైయ్యారు. మల్టీ స్పోర్ట్స్ ఫ్రాంచైజీ 'ముంబై గేమ్స్'ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా భారత బ్యాడ్మింటన్ క్రీడా స్థితిగతులపై ప్రసంగించారు.

మనోళ్ల ప్రదర్శన చాలా సంతృప్తినిచ్చి
‘బ్యాడ్మింటన్‌కు ఈ ఏడాది అంతగా కలిసిరాలేదు. అయినప్పటికీ మనోళ్ల ప్రదర్శన చాలా సంతృప్తినిచ్చింది. ఇంత కఠిన పరిస్థితుల్లోనూ మన క్రీడాకారులు మెరుగైన ప్రదర్శన చేశారు. సింధు, శ్రీకాంత్ తమ స్థాయి తగ్గనివ్వలేదు. ఇంకా వాళ్లు టాప్-10 ర్యాంకుల్లోనే కొనసాగుతున్నారు. ఇదే ఏడాది కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్ లాంటి మూడు మెగా ఈవెంట్‌లలో తీరిక లేకుండా జరిగినా గొప్పగా ఆడారు'

పతకాలు సాధించాలంటే శ్రమించాల్సి ఉంటుంది
'వీటిలో పతకాలు సాధించాలంటే చాలా శ్రమించాల్సి ఉంటుంది. కానీ మాకు అంత సమయం లేదు. ఉన్న సమయాన్నే సద్వినియోగం చేసుకుంటూ ఈ 3 పెద్ద ఈవెంట్‌లలోనూ పతకాలు సాధించాలన్నదే లక్ష్యంగా బరిలో దిగాం. అనుకున్నది సాధించాం. వచ్చే ఏడాది కోసం ప్రణాళికలు రచించుకోవాల్సి ఉంది' అని వివరించారు.

చాలా మెరుగవ్వాల్సి ఉంది.
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో మేం చాలా మెరుగవ్వాల్సి ఉంది. శ్రీకాంత్‌నే చూసుకుంటే అతను ఈ మధ్య ఇద్దరి చేతుల్లో పరాజయం ఎదుర్కొంటున్నాడు. ఎక్కడ పొరపాటు జరుగుతుందో చూసి వారిపై గెలిచేలా మేం తయారవ్వాలి. వెంటవెంటనే టోర్నమెంట్‌లలో పాల్గొనాల్సి రావడంతో సరైన ప్రాక్టీస్ లేకుండా పోతోంది' అని గోపీచంద్ వివరించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications