For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నా కెరీర్ ముగింపు దశలో ఉంది: సైనా సంచలన ప్రకటన

న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ సంచలన ప్రకటన చేసింది. ఇప్పటి వరకు ఎన్నో విజయాలను భారత్‌కు అందించిన సైనా.. గత కొంత కాలంగా గాయాలతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలోనే సైనా ఈ మేరకు ప్రకటించినట్లు తెలుస్తోంది.

వెంటాడుతున్న గాయాల కారణంగా తన కెరీర్‌ అర్ధంతరంగా ముగిసే అవకాశం ఉందని సైనా నెహ్వాల్‌ ఆవేదన వ్యక్తం చేసింది. మోకాలి శస్త్రచికిత్స తర్వాత కోలుకున్న సైనా.. మళ్లీ ప్రాక్టీస్‌ ప్రారంభించింది.

నవంబర్ 15న ఆరంభమయ్యే చైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో ఆమె బరిలోకి దిగనుంది. అయితే గెలుపోటముల గురించి తాను ఆలోచించడం లేదని.. తన ఫిట్‌నెస్‌ను పెంచుకోవడంపైనే దృష్టిసారించినట్టు సైనా చెప్పింది.

Maybe it is the end of my career: Saina Nehwal

'చాలా మంది నా కెరీర్‌ ముగుస్తుందని.. నేను కోర్టులోకి తిరిగి రానని భావిస్తున్నారు. నాకు కూడా ఏదో మూలన ఇలాంటి భావనే ఉంది. కానీ, భవిష్యతలో ఏం జరుగుతుందో చూడాలి' అని సైనా పేర్కొంది.

ఇక సుదీర్ఘ లక్ష్యాలను ఏమీ నిర్దేశించుకోవడం లేదని.. వచ్చే ఏడాది గురించి మాత్రమే ఆలోచిస్తున్నట్టు నెహ్వాల్‌ స్పష్టం చేసింది. కాగా, గాయం కారణంగానే రియో ఒలింపిక్స్‌ నుంచి గ్రూప్‌ దశలోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఆ టోర్నీలో గాయపడ్డ సైనా.. ముంబైలో మోకాలు శస్త్ర చికిత్స చేయించుకుని ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+