For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సింధు ఔట్‌.. క్వార్టర్స్‌లో శ్రీకాంత్

Malaysia Open: PV Sindhu Knocked Out, Kidambi Srikanth Advances To Next Round

మలేసియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీనుండి భారత షట్లర్‌ పీవీ సింధు నిష్క్రమించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో సింధు 18-21, 7-21 తేడాతో దక్షిణా కొరియాకు చెందిన సుంగ్‌ జీ హ్యూన్‌ చేతిలో ఓడిపోయింది. తొలి గేమ్‌లో గట్టి పోటీ ఇచ్చిన సింధు.. రెండో గేమ్‌లో హ్యూన్‌ ఆట ముందు నిలవలేకపోయింది. దీంతో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా చేజార్చుకుంది.

క్వార్టర్స్‌లో శ్రీకాంత్‌ :
ఇక పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. రెండో రౌండ్‌లో శ్రీకాంత్‌ 21-11, 21-15 తేడాతో థాయ్‌లాండ్‌కు చెందిన కొసిట్‌ ఫెట్‌ప్రదబ్‌పై సునాయాస విజయాన్ని అందుకున్నాడు. దీంతో క్వార్టర్స్‌ బెర్తును ఖాయం చేసుకున్నాడు. అయితే తొలి గేమ్‌లో అదరగొట్టిన శ్రీకాంత్‌.. రెండో గేమ్‌లో మాత్రం కాస్త తడబడి పుంజుకున్నాడు.

మిక్స్‌డ్‌ డబుల్స్‌లోనూ పరాజయం:
మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కిరెడ్డి-ప్రణవ్‌ చోప్రా జోడి పోరాటం ముగిసింది. సిక్కి జోడీ 15-21, 21-17, 13-21తో తాన్‌కియాన్‌-లాయ్‌ జింగ్‌ (మలేసియా) జంట చేతిలో ఓటమిని ఎదుర్కొన్నారు. ఇక ఈ టోర్నీలో భారత్‌ నుంచి శ్రీకాంత్‌ ఒక్కడే మిగిలాడు. ఇప్పుడు భారత్ ఆశలన్నీ అతనిపైనే. ఇప్పటికే సైనా నెహ్వాల్ టోర్నీ మొదటి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే.

Story first published: Friday, April 5, 2019, 9:36 [IST]
Other articles published on Apr 5, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+