Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మలేసియా మాస్టర్స్: క్వార్టర్స్‌లోకి ప్రవేశించిన సైనా నెహ్వాల్

Malaysia Masters: Saina Nehwal cruise to quarter-finals, Sameer Verma bows out

హైదరాబాద్: కౌలాలంపూర్‌ వేదికగా జరుగుతున్న మలేసియా మాస్టర్స్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో ప్రి క్వార్టర్స్‌లో సైనా నెహ్వాల్ 25-23, 21-12 తేడాతో వరల్డ్‌ తొమ్మిదో ర్యాంకర్‌ ఆన్‌ సె యంగ్‌(దక్షిణ కొరియా)పై విజయం సాధించింది.

ఇరువురి మధ్య తొలి గేమ్‌ హోరీ హోరీగా సాగింది. తొలి గేమ్‌లో ఒకానొక సమయంలో ఇద్దరి స్కోరు 23-23గా సమంగా నిలిచింది. అయితే, సైనా తన అనుభవాన్ని ఉపయోగించి వరుసగా రెండు పాయింట్లు సాధించి గేమ్‌ను సొంతం చేసుకుంది. ఇక రెండో గేమ్‌ ఏకపక్షంగా జరిగింది.

రెండో గేమ్‌లో సైనా నెహ్వాల్ కేవలం 40 నిమిషాల్లో రెండో రౌండ్‌ను కైవసం చేసుకోవడంతో పాటు గేమ్‌ను కూడా సొంతం చేసుకుంది. ఆన్‌ సె యంగ్‌పై సైనాకు ఇది తొలి విజయం. గతేడాది జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సైనాపై ఆన్‌ సె యంగ్‌ విజయం సాధించింది. ఈ విజయంతో సైనా ప్రతీకారం తీర్చుకున్నట్లు అయింది.

సైనా నెహ్వాల్ క్వార్టర్స్‌లో స్పెయిన్‌ స్టార్‌ షట్లర్ కరోలినా మార్టిన్‌తో సైనా తలపడనుంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో సమీర్ వర్మ పోరాటం ముగిసింది. 40 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జి జియా లీ(మలేసియా) 21-19, 22-20తో సమీర్‌ను ఓడించాడు. ఫలితంగా టోర్నీ నుంచి సమీర్ నిష్క్రమించాడు.

కాగా, పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌, పారుపల్లి కశ్యప్‌, సాయి ప్రణీత్‌ నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ శ్రీకాంత్‌ 17-21, 5-21 తేడాతో రెండో సీడ్‌ చౌ టెన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో కనీస పోరాటం కనబరచకుండా వెనుదిరిగాడు. మరో సింగిల్స్‌లో సాయి ప్రణీత్‌ 11-21, 15-21తో రాస్మస్‌ గెమ్కె (డెన్మార్క్‌) చేతిలో ఓడి టోర్నీ నుంచి వైదొలిగాడు. కశ్యప్‌ 17-21, 16-21తో మొమోటా చేతిలో ఓటమిపాలయ్యాడు.

Story first published: Thursday, January 9, 2020, 13:25 [IST]
Other articles published on Jan 9, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+