
హైదరాబాద్: కౌలాలంపూర్ వేదికగా జరుగుతున్న మాలేసియా మాస్టర్స్‌లో భారత టాప్ షట్లర్ల పోరాటం ముగిసింది. టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ పోటీల్లో భారత షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధులు తమ ప్రత్యర్ధుల చేతుల్లో ఓడిపోయారు.
టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో ఆరో సీడ్ పీవీ సింధు 16-21, 17-21తేడాతో వరల్డ్ నెంబర్ వన్ తై జు యింగ్(చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. గతేడాది వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ గెలిచిన తర్వాత క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న పీవీ సింధు మరోసారి నిరాశ పరిచింది.
తొలి గేమ్ ఆరంభం నుంచే పీవీ సింధు తడబడింది. తై జు యింగ్‌పై లభించిన ఆరంభ ఆధిపత్యాన్ని పీవీ సింధు ఆ తర్వాత కొనసాగించలేకపోయింది. దీంతో తొలి గేమ్‌ను 16-21తో సింధు కోల్పోయింది. ఇక, దూకుడుగా ఆడాల్సిన రెండో గేమ్‌లో కూడా పీవీ సింధు పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
ప్రారంభం నుండి చివరి వరకు తై జు యింగ్ పూర్తిగా ఆధిపత్యం చెలాయించడంతో సింధు ఒకానొక సమయంలో 11-20 పాయింట్ల వెనుకబడింది. చివర్లో మ్యాచ్ విజయానికి కావాల్సిన ఆరు పాయింట్లను గెలుచుకోవడంతో 21-16తో గేమ్‌ను గెలుచుకుంది. దీంతో సింధుపై తన రికార్డుని తై జు యింగ్ మరింతగా పెంచుకుంది.
వీరిద్దరూ ఇప్పటివరకు 17 సార్లు తలపడగా సింధు 12 సార్లు ఓడిపోయింది. అయితే, సింధుపై తై జు యింగ్‌కు ఇది వరుసగా రెండో విజయం. మరో మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ 21-8, 21-7 తేడాతో స్పెయిన్ స్టార్ ప్లేయర్ కరోలినా మారిన్ చేతిలో ఓడిపోయింది.