Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాతిక నిమిషాల్లోనే ఆట ముగించిన సిక్కి జోడి

 Malaysia Masters 2018: Viktor Axelsen, Sai Praneeth win; Ashwini Ponnappa-Sikki Reddy advance into pre-quarters

హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లైన సాయి ప్రణీత్, అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి మలేసియా మాస్టర్స్ గ్రాండ్ ఫ్రీ గోల్డ్ టోర్నీలో పాల్గొంటున్నారు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో కేవలం పాతిక నిమిషాల్లోనే సిక్కి జోడి ప్రత్యర్థి ద్వయాన్ని మట్టి కరిపించింది.

మహిళల డబుల్స్ విభాగంలో పాల్గొన్న సిక్కి, అశ్వినిలు జర్మనీకి చెందిన జోహన్నా గోలిస్‌జ్వెవ్‌స్కీ, లారా క్యాపెలిన్‌పై తలపడ్డారు. ఈ పోటీలో ఇరు జట్లు 21-15, 21-12 స్కోరును సంపాదించగా భారత ద్వయానికే విజయం దక్కింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో పాల్గొన్న సాయి ప్రణీత్ 21-13, 21-13తో కాంటపోన్ వాంగ్‌చెరాన్‌పై విజయం సాధించాడు.

కాగా ఈ మ్యాచ్‌లో కేవలం 25 నిమిషాల్లోనే ప్రత్యర్థి ద్వయాన్ని మట్టికరిపించిడం విశేషం.

ఇంకా పురుషుల సింగిల్స్ విభాగంలో దనిశ్ ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడైన విక్టర్ అక్సెలెన్‌తో తలపడి ఓడిపోయాడు. దీంతో అతను ఇక ఇంటికి వెళ్లడమే తరువాయి. ఇంకా ఈ పోటీలో ఛైనాకు చెందిన లిన్ దాన్, చెన్ లాంగ్, దక్షిణకొరియాకు చెందిన వాన్ హో, మలేషియాకు చెందిన వెటరన్ లీ ఛాంగ్ వీ లు మొదటి రౌండ్‌కే వెనుదిరిగారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, January 18, 2018, 11:17 [IST]
Other articles published on Jan 18, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+