మలేషియా మాస్టర్స్ 2017: టైటిల్ సైనా వశం
సిబు: మలేసియా మాస్టర్ గ్రాండ్ ప్రి గోల్డ్ బాడ్మింటన్ టైటిల్‌ను భారత షట్టర్ సైనా నెహ్వాల్ ఆదివారం నాడు కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో థాయిలాండ్ క్రీడాకారిణి చొచువాంగ్‌పై 22-20, 22-20 తేడాతో వరుస సెట్లలో గెలుపొందింది.
ఆదివారం ఫైనల్లో సైనా థాయిలాండ్ అమ్మాయి, ప్రపంచ 67వ ర్యాంకు క్రీడాకారిణి పోర్న్‌పావీ చోచువాంగ్‌ను ఓడించింది.

శనివారం నాడు ఈ టోర్నీలో భాగంగా జరిగిన సెమీ ఫైనల్లో సైనా ఏకపక్షంగా గెలుపొందారు. సెమీఫైనల్లో సైనా 21-13, 21-10తో హాంకాంగ్ క్రీడాకారిణి యిప్ పుయ్ యిన్‌పై ఘనవిజయం సాధించింది.
సైనాతో 8 మ్యాచ్‌లాడి ఆరు ఓడిన యిన్ సెమీస్ తొలి గేమ్‌లో మాత్రమే పోటీ ఇచ్చింది. గేమ్ సగ భాగం వరకు కొంత పోటాపోటీగానే సాగింది. అయితే 14-13తో ఆధిక్యంలో ఉన్న దశలో సైనా విజృంభించింది. వరుసగా 7 పాయింట్లతో గేమ్‌ను సొంతం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లో సైనా ధాటికి యిన్ నిలవలేకపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications