గ్రాండ్‌గా సైనా, కశ్యప్‌ల రిసెప్షన్: హాజరైన ప్రముఖులు వీరే (ఫోటోలు)


హైదరాబాద్: బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ శుక్రవారం వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వివాహ అనంతరం వీరి జోడి ఆదివారం హైటెక్ సిటీలోని నోవాటెల్‌లో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్ అత్యంత గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్, టాలీవుడ్ తారలతో పాటు, క్రీడా రంగ, రాజకీయ ప్రముఖలు హాజరయ్యారు.

సైనా-కశ్యప్ రిసెప్షన్‌కు హాజరైన ప్రముఖులు వీరే
ఈ వేడుకకు హాజరైన నాగార్జున, అమల, చాముండేశ్వరీనాథ్, హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, రాచకొండ సీపీ మహేశ్ భగవత్, సుధీర్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్, కళ్యాణ్, శ్రీజ దంపతులు, దానం నాగేందర్, పురందేశ్వరి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప, జ్వాలా గుత్తా తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

శుక్రవారం వివాహా బంధంతో ఒక్కటైన సైనా-కశ్యప్
అంతకముందు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ వివాహా బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, అతికొద్దిమంది అతిధులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ సమక్షంలో శుక్రవారం ఈ ఇద్దరి పెళ్లి హైదరాబాద్ రాయదుర్గంలోని సైనా నివాసం ‘ఒరియన్ విల్లా'లో కుటుంబ సభ్యులు, బంధువులు, అత్యంత ఆప్తుల మధ్య శుక్రవారం వీరి వివాహం ఘనంగా జరిగింది.

పెళ్లికి ప్రత్యేక అతిథులుగా గవర్నర్ నరసింహన్ దంపతులు
రిజిస్టర్ మ్యారేజీ ద్వారా సైనా, కశ్యప్‌లు ఒక్కటయ్యారు. ఈ పెళ్లికి గవర్నర్ నరసింహన్, విమల దంపతులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. గత ఎనిమిదేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సందర్భంగా బంధువులు, శ్రేయోభిలాషుల రాకతో వీరివురి ఇళ్లు సందడిగా మారాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications