అచ్చం నాలానే ఉన్న వ్యక్తిని సెక్స్ వీడియోలో చూసిన నా భార్య..

Posted By: Subhan
Lee Chong Wei reveals how his wife reacted to sex tape allegations

హైదరాబాద్: 'ఆ వీడియోలో ఉన్న వ్యక్తిని నేను కాదు. ఎవరో ఇది కావాలనే చేస్తున్నారు' అని తన ఆవేదనను వెల్లగక్కుతున్నాడు మలేషియా బ్యాడ్మింటన్‌ ఆటగాడు లీ చాంగ్. ఇప్పటికే ఆ దేశ ఆటగాళ్లు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. దీంతో పాటు తాజాగా మూడుసార్లు ఒలింపిక్‌ పతక విజేతగా నిలిచిన లీ చాంగ్‌ వైకు సైతం ఆ సమస్యలు తప్పలేదు.

అతనికి సంబంధించిన ఓ సెక్స్‌ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియో తీవ్ర దుమారం లేపింది. దీనిపై లీ చాంగ్‌ పోలీసులను ఆశ్రయించాడు. అనంతరం మీడియాకు ఆ వీడియోలో ఉంది తాను కాదని స్పష్టం చేసి నేరస్థుడ్ని పట్టుకోవాలంటూ కేసు నమోదు చేశాడు.

ఇద్దరు మలేషియా ఆటగాళ్లు గత ఏడాది మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని వారిపై జీవితకాల నిషేధం విధించాలని ఇప్పటికే బీడబ్ల్యూఎఫ్‌(బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌) బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ మలేషియాకు లేఖ రాసింది.

గత కొద్ది రోజులుగా ఓ సెక్స్‌ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అందులో ఉన్న వ్యక్తి లీ చాంగ్‌ను పోలి ఉన్నాడు. అప్రమత్తమైన లీ చాంగ్‌ మంగళవారం పోలీసులను ఆశ్రయించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎవరో ఇదంతా కావాలనే చేశారని, వారిని అదుపులోకి తీసుకుని శిక్షించాలని చాంగ్‌ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అనంతరం చాంగ్‌ మీడియాతో మాట్లాడాడు.

'ఆ వీడియోలో ఉంది నేను కాదు. అందులో ఉన్న వాయిస్‌ కూడా నాది కాదు. నేనంటే ఎవరో గిట్టని వారు ఇదంతా చేశారు. నా పేరు ప్రతిష్ఠలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తే అందులో ఉన్నది నేను కాదని మీకు తెలుస్తోంది. ఈ వీడియో చూసి చాలా మంది నాకు ఫోన్‌ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశాను కాబట్టి ఇక దీని గురించి ఆలోచించను. నా సమయం వృథా చేసుకోను' అని చెప్పాడు. అలాగే తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా తనకు ఆ వీడియోకు ఎలాంటి సంబంధం లేదని చాంగ్‌ అభిమానులకు తెలిపాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, February 14, 2018, 15:07 [IST]
Other articles published on Feb 14, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి