శ్వాసకోశ సంబంధిత సమస్య: లీ చోంగ్ వీ కీలక నిర్ణయం

హైదరాబాద్: మలేసియా బ్యాడ్మింటన్ లెజెండ్ లీ చోంగ్ వీ ప్రపంచ చాంపియన్‌షిప్, ఆసియా క్రీడల నుంచి తప్పుకున్నాడు. ఈ మేరకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ మలేసియా అధికారిక ప్రకటన చేసింది. 35 ఏళ్ల లీ చోంగ్ వీ ప్రస్తుతం శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు.
దీంతో అతను కనీసం నెలరోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. వైద్యుల సూచన మేరకు లీ చోంగ్ వీ జులై 30 నుంచి చైనాలోని నాన్‌జింగ్ వేదికగా జరగనున్న వరల్డ్ చాంపియన్ షిప్ పోటీల నుంచి ఆగస్టులో ఇండోనేసియా రాజధాని జకార్తా వేదికగా జరిగే ఆసియా క్రీడల నుంచి తప్పుకున్నాడు.
"లీ చోంగ్ వీ తాను ప్రస్తుతం శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్నానని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ మలేసియా (బీఎఎమ్)కు చెప్పడం జరిగింది. దీంతో అతడు వైద్యుల సూచన మేరకు నెలరోజులపాటు విశ్రాంతి తీసుకోనున్నాడు" అని బీఎఎమ్ తన అధికారిక ప్రకటనలో పేర్కొంది.
మూడు సార్లు ఓలింపిక్ పతక విజేత అయిన లీ చోంగ్ వీ ఈ ఏడాది తొమ్మిది టోర్నీలు ఆడాడు. ఇందులో ఆస్ట్రేలియాలోని గోల్డ్ గోస్ట్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం నెగ్గడంతోపాటు మలేసియా ఓపెన్‌లో విజేతగా నిలిచాడు. జకార్తా వేదికగా ఆసియా గేమ్స్ ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 2 వరకు జరగనున్న సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications