
కొరియా: చైనా ఓపెన్‌లో తొలి రౌండ్‌లో ఓడిపోయి వెనుదిరిగిన సైనా.. కొరియా ఓపెన్ 2018లో అయినా రాణించి టైటిల్ సాధించాలని కలలుకంది. ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో ప్రయత్నించిన ఈ స్టార్ షట్లర్ పోరాటాన్ని మధ్యలోనే ముగించింది. టోర్నీలో వరుసగా మూడు విజయాలతో దూకుడు మీద కనిపించిన ఐదో సీడ్ సైనా నెహ్వాల్ శుక్రవారం గేమ్‌లోనూ గెలిచి తీరుతుందనుకున్న ఆశలు నీరుగార్చింది.
ఇలా బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో మూడో సీడ్, జపాన్ షట్లర్ నొజొమి ఒకుహర చేతిలో పరాజయాన్ని చవిచూసింది. సుదీర్ఘ కెరీర్‌లో ఇప్పటి వరకు 10 సార్లు ఒకుహరతో తలపడిన సైనా నెహ్వాల్.. ఆమె చేతిలో ఓడటం ఇది నాలుగోసారి. ఉత్కంఠగా ముగిసిన శుక్రవారం మ్యాచ్‌లో తొలి సెట్‌ని 15-21తో చేజార్చుకున్న సైనా నెహ్వాల్ అద్భుతంగా ఆరంభించింది.
ఆ తర్వాత రెండో సెట్‌లో అద్భుతంగా పుంజుకుని 21-15తో విజయాన్ని అందుకుంది. దీంతో.. మ్యాచ్ 1-1తో సమమవగా.. విజేత నిర్ణయాత్మక మూడో సెట్‌లో ఇద్దరు షట్లర్లూ హోరాహోరీగా తలపడ్డారు. కానీ.. ఆఖరి వరకూ పట్టు వదలకుండా పోరాడిన ఒకుహర 22-20తో మూడో సెట్‌లో గెలిచి సెమీ ఫైనల్‌కి దూసుకెళ్లింది.
పీవీ సింధు... వరుస టోర్నీలతో అలసిపోవడం వల్ల కొరియా ఓపెన్‌కు దూరమైంది. తెలుగు స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ కూడా కొరియా ఓపెన్‌కు దూరంగా ఉంటున్నాడు. ఒక వేళ సైనా నెహ్వాల్ సెమీస్ చేరితే టాప్‌సీడ్ అకానే యమగుచి (జపాన్)తో తలపడే అవకాశం ఉండేది.