హైదరాబాద్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భారత్‌కు తొలి రోజు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. సైనా నెహ్వాల్, సాయి ప్రణీత్, కిదాంబి శ్రీకాంత్ రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లగా, పారుపల్లి కశ్యప్, అజయ్ జయరాం, హెచ్‌ఎస్ ప్రణయ్ తొలి రౌండ్‌లో ఓటమి పాలయ్యారు.
ఇటీవలే గాయాల నుంచి కోలుకుని పునరాగమనం చేసిన తెలుగు తేజం పారుపల్లి కశ్యప్ తొలి రౌండ్‌లో వరల్డ్ నెంబర్ వన్ సాన్ వాన్ హో(కొరియా) చేతిలో 21-18, 14-21, 21-15 తేడాతో ఓటమి పాలయ్యాడు. ఇక హెచ్‌ఎస్ ప్రణయ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ క్రీడాకారుడి చేతిలో ఓటమి పాలయ్యాడు.

ఇక మహిళల సింగిల్స్‌లో సంగ్ జీ హువాన్(దక్షిణకొరియా)తో తలపడిన సైనా నెహ్వాల్ 21-10, 21-16తో విజయం సాధించి రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టింది. మరో మ్యాచ్‌లో సయాకా సాటో(జపాన్)తో తలపడిన పీవీ సింధు 21-17, 14-21, 21-18తేడాతో విజయం సాధించింది.
పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్ విజయం సాధించారు. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-సిక్కిరెడ్డి జోడీ, పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ జోడీ తొలి రౌండ్‌లో విజయం సాధించి రెండో రౌండ్ లోకి అడుగు పెట్టారు.