Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కామన్వెల్త్ గేమ్స్‌లో అదరగొట్టిన అమలాపురం ఆటగాడు

Kidambi Srikanth, Saina Nehwal headline India’s first badminton mixed team gold

హైదరాబాద్: కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో తొలిసారి స్వర్ణం సాధించి భారత బృందం చరిత్ర సృష్టించింది. ఈ విషయంపై కోచ్ పుల్లెల గోపీ‌చంద్ ఆనందంతో పాటు ఆశ్చర్యాన్ని వ్తక్తం చేశాడు. అయితే ఈ మిక్స్‌డ్‌ టీం ఈవెంట్‌లో స్వర్ణం సాధించడంలో అమలాపురానికి చెందిన రంకిరెడ్డి సాత్విక్‌ సాయిరాజ్‌ కీలక పాత్ర పోషించాడు.
బ్యాడ్మింటన్‌ విభాగంలో మెన్‌, ఉమెన్‌ మిక్స్‌డ్‌ టీం ఈవెంట్‌లో భాగంగా జరిగిన పోటీల్లో పీవీ సింధూ, కిదాంబి శ్రీకాంత్‌, సైనా నెహ్వాల్‌ తదితరులతో పాటు సాత్విక్‌ సాయిరాజ్‌ జతకట్టి ఈ విజయంలో భాగస్వామ్యం అయ్యాడు. ఇంటర్ సెకెండ్ ఇయర్ చదువుతోన్న సాత్విక్‌ సాయిరాజ్‌ తన తొలి కామన్‌వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు స్వర్ణం అందించడంతో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

తల్లిదండ్రులు ఇద్దరూ టీచర్లే:

తల్లిదండ్రులు ఇద్దరూ టీచర్లే:

సాత్విక్ సాయిరాజ్ తల్లితండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులే. తండ్రి కాశీవిశ్వనాథం ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పనిచేసి ఇటీవలే ఉద్యోగ విరమణ చేశారు. తల్లి రంగమణి ప్రస్తుతం స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆయన సోదరుడు అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా స్థిరపడ్డారు.

అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో విజయాలు

అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో విజయాలు

కామన్‌వెల్త్‌ క్రీడల్లో దేశం తరఫున పాల్గొన్న సాత్విక్‌ గతంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో విజయాలు సాధించారు. 2015లో ఏషియన్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ జూనియర్‌ డబుల్స్‌ విభాగంలో విజేతగా నిలిచారు. బంగ్లాదేశ్‌ ఛాలెంజ్‌ టోర్నమెంట్‌, వియత్నాం ఛాలెంజ్‌ టోర్నమెంట్, ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌ టోర్నమెంట్‌లోనూ సాత్విక్ తన సత్తాచాటాడు. అనేక టోర్నీల్లోనూ విజేతగా నిలిచి బంగారు పతకాలను సాధించారు.

అమలాపురంలో సంబరాలు

అమలాపురంలో సంబరాలు

కామన్వెల్త్ క్రీడల్లో సాత్విక్ సాధించిన విజయంతో సొంతూరు అమలాపురంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. దేశం తరఫున ఆడి బంగారు పతకం సాధించడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కోనసీమ ఐకాసా ఆధ్వర్యంలో సోమవారం రాత్రి ప్రత్యేక అభినందన కార్యక్రమం ఏర్పాటుచేసి మిఠాయిలు పంచారు.

అశ్వని పొన్నప్పతో జోడీ కట్టిన సాత్విక్

అశ్వని పొన్నప్పతో జోడీ కట్టిన సాత్విక్

మిక్స్‌డ్ డబుల్స్‌లో అశ్వని పొన్నప్పతో జోడీ కట్టిన సాత్విక్ మలేసియాకు చెందిన పెంగ్ సూన్-లి యింగ్ హో ద్వయంపై 21-14, 15- 21, 21- 15తో గెలిచి భారత్‌కు శుభారంభాన్ని ఇచ్చారు. ఇక పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ మూడు సార్లు ఒలింపిక్ రజత పతక విజేత లీ చాంగ్ వీని ఓడించాడు. మహిళ సింగిల్స్‌లో సోనియా చెయాను 21-11, 19- 21, 21- 8 తో సైనా నెహ్వాల్ మట్టికరిపించింది. దీంతో భారత్ స్వర్ణం గెలుపొందింది.

Story first published: Tuesday, April 10, 2018, 11:59 [IST]
Other articles published on Apr 10, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+