Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ర్యాంక్‌ల గురించి ఆలోచించను, కోచ్ గోపి కృషి ఎంతో ఉంది'

హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ మంగళవారం హైదరాబాద్‌కు చేరుకున్నాడు. వరుసగా రెండు సూపర్‌ సిరీస్‌ టైటిళ్లు సాధించి స్వదేశానికి చేరుకున్న శ్రీకాంత్‌కు శంషాబాద్‌ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. అభిమానులు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ మీడియాతో మాట్లాడాడు. 'వరుసగా రెండు సూపర్‌ సిరీస్‌ టైటిళ్లు గెలవడం ఎంతో సంతోషంగా ఉంది. నా విజయాల వెనుక కోచ్‌ పుల్లెల గోపిచంద్‌ కృషి ఎంతో ఉంది' అని అన్నాడు. తాను ర్యాంక్‌ల గురించి ఎప్పుడూ ఆలోచించలేదని, టోర్నీల్లో బాగా రాణిస్తే చాలు అని అనుకుంటానని తెలిపాడు.

 Kidambi Srikanth returns to Hyderabad after winning Denmark & French Open Super Series titles

ఈ ఏడాది ఇండోనేషియా ఓపెన్‌, ఆస్ట్రేలియా ఓపెన్‌, డెన్మార్క్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలిచి ఒక ఏడాదిలో నాలుగు సూపర్‌ సిరీస్‌ టైటిళ్లు గెలిచిన లీ చాంగ్‌ వీ, లిన్‌ డాన్‌, చెన్‌ లాంగ్‌ ఆటగాళ్ల జాబితాలో కిదాంబి శ్రీకాంత్‌ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో నంబర్ వన్ ర్యాంకు గురించి ప్రశ్నించగా 'నెంబర్ వన్ కావాలని ఎవరికైనా ఉంటుంది. అయితే ఇప్పటి వరకు నేను ర్యాంకుల గురించి ఆలోచించలేదు. ప్రస్తుతం.. ఆడాలి, గెలవాలి అన్నదే నా లక్ష్యం. డెన్మార్క్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిళ్లతో ర్యాంకు మెరుగవ్వొచ్చు' అని శ్రీకాంత్ పేర్కొన్నాడు.

'ప్రకాశ్‌ పదుకొనె, గోపీచంద్‌ లాంటి దిగ్గజాల సరసన చేరానని భావిస్తున్నారా?' అని మీడియా ప్రశ్నించగా... దీనికి శ్రీకాంత్ బదులిస్తూ 'వారి సరసన నిలబడే స్థాయి నాకింకా రాలేదు. ఇంకా మెరుగ్గా ఆడాలి. సూపర్‌ సిరీస్‌ల కంటే పెద్ద విజయాలు కావాలి. ఒలింపిక్స్‌, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ లాంటి టోర్నీల్లో పతకాలు సాధించినప్పుడు వారి స్థాయికి చేరుకుంటానేమో' అని అన్నాడు.

ఇక, భారత పురుషుల సింగిల్స్‌ ఇప్పుడు మంచి స్థితిలో ఉందని శ్రీకాంత్‌ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. 'నేను 4 టైటిళ్లు సాధించా. సాయిప్రణీత్‌ ఒక టైటిల్‌ గెలిచాడు. ప్రణయ్‌ అద్భుతంగా ఆడుతున్నాడు.. అతడు డెన్మార్క్‌ ఓపెన్‌లో లీ చాంగ్‌ వీని ఓడించాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ సెమీస్‌లో నాకు గట్టి పోటీ ఇచ్చాడు. అందరూ బాగా ఆడుతున్నారు' అని శ్రీకాంత్ అన్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+