Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సోషల్ మీడియాలో వైరల్: ‘గల్లీ బాయ్’తో పీవీ సింధు సెల్ఫీ

 Keep Rocking: PV Sindhu Posts Picture With Gully Boy Ranveer Singh

హైదరాబాద్: భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు 'గల్లీ బాయ్' సినిమా నటుడు అయిన బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్‌ను కలిశారు. ముంబైలో జరుగుతున్న లాక్మే ఫ్యాషన్‌ వీక్‌ కార్యక్రమంలో సోమవారం సింధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీవీ సింధు తెలుపు రంగు గౌను ధరించి ర్యాంప్‌‌పై వాక్‌ చేశారు.

అనంతరం ఇదే కార్యక్రమానికి హాజరైన రణ్‌వీర్‌ సింగ్‌ను ఆమె కలిశారు. రణవీర్‌తో కలిసి దిగిన సెల్ఫీను ట్విటర్‌లో అభిమానులతో పంచుకున్నారు. ''గల్లీ బాయ్‌తో' సెల్ఫీ.. మిమ్మల్ని మళ్లీ కలిసినందుకు సంతోషంగా ఉంది. మీరెప్పుడూ ఇలాగే అందరినీ ఉత్సాహపరుస్తూ ఉండాలి. 'గల్లీ బాయ్‌' సినిమాకు ఆల్‌ ది బెస్ట్‌' అని ట్వీట్ చేశారు.

ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. రణ్‌వీర్‌ ప్రధాన పాత్రలో 'గల్లీ బాయ్' చిత్రం తెరకెక్కింది. ఫిబ్రవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అందుకే పీవీ సింధు రణ్‌వీర్‌ సింగ్‌ను 'గల్లీబాయ్‌' అని అంటూ సంబోధించారు.

లాక్మే ఫ్యాషన్‌ వీక్‌ కార్యక్రమంలో సింధుతో పాటు సైనా నెహ్వాల్, ప్రముఖ రెజ్లర్‌ గీతా ఫొగాట్‌ కూడా ర్యాంప్‌ వాక్‌ చేసి ఆకట్టుకున్నారు. వీరు ముగ్గురూ వివిధ ఫ్యాషన్‌ డిజైనర్లకు షో స్టాపర్స్‌గా వ్యవహరించారు. 1999 నుంచి ఏటా ఐఎంజీ రిలయన్స్‌ లిమిటెడ్‌, లాక్మే సంస్థలు సంయుక్తంగా ఈ ఫ్యాషన్‌ వీక్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.

Story first published: Tuesday, February 5, 2019, 15:50 [IST]
Other articles published on Feb 5, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+