పీవీ సింధు దాతృత్వం: బసవతారకం కేన్సర్ ఆసుపత్రికి విరాళం
హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్, రియో ఒలింపిక్స్ పతక విజేత పీవీ సింధు తన దాతృత్వాన్ని చాటుకుంది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి రూ. 25లక్షలు విరాళం ప్రకటించింది. ఇటీవల అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'కౌన్ బనేగా కరోడ్‌పతి' కార్యక్రమంలో పీవీ సింధు పాల్గొన్న సంగతి తెలిసిందే.
రూ.25 లక్షలు గెలుచుకున్న పీవీ సింధు
ఇటీవలే ముంబైలో జరిగిన ఈ షోలో పీవీ సింధు... బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ అడిగిన ప్రశ్నలకి చక్కగా సమాధానాలు చెప్పి రూ.25 లక్షలు గెలుచుకుంది. ఈ మొత్తాన్ని కేన్సర్ బాధితుల చికిత్స కోసం విరాళంగా అందజేసింది. ఈ మేరకు విరాళం రూపంలో పీవీ సింధు రూ. 25లక్షలు ఆసుపత్రికి అందజేసిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

పీవీ సింధుని ఆదర్శంగా తీసుకోవాలి
ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు ఒక ప్రకటన ద్వారా తెలియజేశాయి. పీవీ సింధుని ఆదర్శంగా తీసుకుని క్యాన్సర్ బాధితుల కోసం విరాళాలు ఇవ్వడానికి మరికొంతమంది ముందుకొస్తారని ఆశిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే 'కౌన్ బనేగా కరోడ్‌పతి' షోలో పాల్గొన్న సింధును అమితాబ్ సాదరంగా ఆహ్వానించారు.

సింధుపై ప్రశంసల వర్షం కురిపించిన అమితాబ్
అంతేకాదు ఆమె విజయాలపై ప్రశంసలు కురిపించారు. ఈ స్పెషల్ షో షూటింగ్ గురించి బిగ్ బి తన బ్లాగులో ఇలా రాశారు. 'ఆమెతో హాట్ సీట్‌ను పంచుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నా. దేశానికి కీర్తిప్రతిష్టలు తెచ్చిన ఓ చాంపియన్ షట్లర్‌తో నాకు ఇది అసాధారణ భేటీ. అద్భుతమైన ఎపిసోడ్' అని పేర్కొన్నారు.

సింధుతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో
ప్రపంచ బ్యాడ్మింటన్‌లో ఆమె ఘనవిజయాలు కొనసాగాలని అమితాబ్ బచ్చన్ ఆకాంక్షించారు. పీవీ సింధుతో కలిసి దిగిన కొన్ని ఫోటోలను ఆయన తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications