For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సైనా నెహ్వాల్‌ని ఆడిపోసుకున్న జ్వాలా గుత్తా..?

By Nageswara Rao
Jwala Gutta
ఎవరేమనుకున్నా తాను అనుకున్నది చెప్పడం గుత్తా జ్వాల లక్షణం. హైదరాబాద్ నుంచి బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ పెద్ద స్టార్‌గా ఎదగగా... 15 ఏళ్లకు పైగా ఆటలో కొనసాగుతున్నా తగిన గుర్తింపు రాలేదని జ్వాల వాపోతోంది. అటు ప్రభుత్వం... ఇటు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) నుంచి ప్రోత్సాహం కరువైందని పేర్కొంది. పెద్దగా అంచనాలు లేకుండా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌కు వెళ్లిన జ్వాల, అశ్విని జోడి ఏకంగా కాంస్యం సాధించి సంచలనం సృష్టించింది. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి ద్వయంగా రికార్డులకెక్కింది.

వరల్డ్ చాంపియన్‌షిప్‌ గెలవడం పట్ల చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. అయితే నా కెరీర్ లక్ష్యం మాత్రం ఒలింపిక్స్ పతకం. ఈ ఏడాదంతా ఇదే ఫామ్, ఫిట్‌నెస్ కొనసాగించి వచ్చే సంవత్సరం లండన్‌లో గెలవాలని కోరుకుంటున్నాను. చిన్నప్పటినుంచి ఇప్పటివరకు నా కెరీర్‌ను మలచిన తండ్రిలాంటి ఆరిఫ్ సర్‌కు ఈ విజయం అంకితం. అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించాలంటే సింగిల్స్ అయినా, డబుల్స్ అయినా అదే స్థాయిలో కష్టపడాల్సి ఉంటుంది. కానీ అందరూ డబుల్స్‌పై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారనిపిస్తోంది.

ఆమెకు చాలా ప్రకటనల ద్వారా ఆదాయం వస్తుంటే నా చేతిలో ఒక్కటీ లేదు. కనీసం రెండు యాడ్స్ అయినా వస్తే అప్పుడు పోల్చవచ్చు. ఏ టోర్నీ ప్రారంభం కాబోతున్నా సైనాకు విజయావకాశాలు అంటూ అవే వార్తలు కనిపిస్తాయి. మేం గెలిచి వచ్చాక కూడా ఆ గుర్తింపు లభించదు. అందరి మధ్యలో ఉంటూ ఒకరిని ప్రత్యేకంగా చూడటం మమ్మల్ని ఎంత నిరుత్సాహపరుస్తుందో నాకు తెలుసు. కామన్వెల్త్ విజయం తర్వాత కూడా అదే పరిస్థితి. ఆమెకు వరుస పెట్టి ఎండార్స్‌మెంట్స్ వచ్చాయి. మేం మాత్రం అలాగే ఉన్నాం.

ఇక సైనా చైనీస్ తైపీ టైటిల్ గెలిస్తే రాష్ట్రప్రభుత్వం రూ.25 లక్షలు ప్రకటించింది. అదే టోర్నీ టైటిల్‌ను మేం మరుసటి ఏడాది నెగ్గాం. ఎవరూ పట్టించుకోలేదు. ప్రభుత్వానికి ఏ టైటిల్ ప్రాధాన్యత ఏమిటనేది తెలీదు. దీని గురించి చెప్పాల్సింది అసోసియేషనే! ఆ రకంగా చూస్తే భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) మమ్మల్ని ఏ మాత్రం ప్రోత్స హించడం లేదు. అందరికీ తెలిసిన ఈవెంట్ కాబట్టి కామన్వెల్త్‌తో పోలుస్తున్నాను. అయినా సైనా గత ఏడాది వరుసగా మూడు టైటిల్స్ నెగ్గితే బంగారు నాణెం, ఆ తర్వాత సిల్వర్ రాకెట్ ఇచ్చారు. ఈ ప్రచారమంతా 'బాయ్" కల్పించిందే. మరి మిగతా క్రీడాకారిణుల విషయంలో వారు చొరవ ఎందుకు తీసుకోరు.

సరైన ప్రోత్సాహం లేదంటూ భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్)పై జ్వాల చేసిన వ్యాఖ్యలు అక్షరాలా నిజం. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో జ్వాల-అశ్విని జోడి కాంస్య పతకం గెలిచి పది రోజులు అవుతున్నా 'బాయ్" అధికారిక వెబ్‌సైట్‌లో ఇప్పటికీ ఆ సమాచారమే లేదు. చివరకి పెళ్లి గురించి ప్రస్తావించగా హైదరాబాద్‌లో నాకు తగిన అబ్బాయి లేడు. అయినా ఇప్పుడు నా కెరీర్‌తో సంతోషంగానే ఉన్నాను. పెళ్లి ఆలోచనలేమీ చేయడంలేదు.
Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+