
ఈమె కొంతకాలంగా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బాయ్)పై అసంతృప్తితో ఉన్నారు. అకాడమీపై గుత్తా జ్వాలా స్పందిస్తూ... తాను ఓ అకాడమీని ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నానని, ప్రభుత్వానికి తాను ప్రపోజల్ పంపించానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
కాగా, రెండు రోజుల క్రితం గుత్తా జ్వాలా బాయ్‌పై నిప్పులు చెరిగారు. అగ్రశ్రేణి క్రీడాకారులు సీనియర్ జాతీయ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనడాన్ని బాయ్ తప్పనిసరి చేయడాన్ని తప్పు పట్టారు. తీరకలేని అంతర్జాతీయ షెడ్యూలు కారణంగా టోర్నీకి సైనా దూరంగా ఉండటాన్ని జ్వాలా సమర్థించినా, వేరు వేరు క్రీడాకారులకు వేర్వేరు నిబంధనలు పెడుతోందంటూ బాయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొందరు క్రీడాకారుల కోసమే నిబంధనలు సడలిస్తున్నారని, ఇతరులను మాత్రం ఆడమని బలవంతం చేస్తున్నారని జ్వాలా ఆవేదన వ్యక్తం చేశారు.