Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైరల్‌ ఫోటోలు: గుత్తా జ్వాలకు ముద్దు పెట్టిన తమిళ హీరో.. డేటింగ్‌ నిజమేనా?!!

Jwala Gutta, Vishnu Vishal usher in new year, wish fans with adorable pics

చెన్నై: భారత బ్యాడ్మింటన్‌ మాజీ స్టార్‌ గుత్తా జ్వాల డేటింగ్‌లో ఉందా? అంటే అవుననే తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా తమిళ హీరో విష్ణు విశాల్‌తో జ్వాల డేటింగ్‌లో ఉన్నట్టు సమాచారం. అయితే న్యూఇయర్‌ సందర్భంగా డిసెంబర్ 31న విషెస్‌ తెలుపుతూ విష్ణు విశాల్‌తో కలిసి దిగిన ఫోటోలను జ్వాల తన అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేసింది. దీంతో డేటింగ్ వార్తలకు మరింత బలం చేకూరింది.

జ్వాలకు విశాల్‌ ముద్దు

జ్వాలకు విశాల్‌ ముద్దు

'హ్యాపీ 2020', 'మై బేబీ హ్యాపీ న్యూఇయర్‌', 'మా నుండి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు' అని గుత్తా జ్వాల ట్వీట్ చేసింది. విష్ణు విశాల్‌, జ్వాల గతంలో షేర్‌ చేసిన ఫోటోలలో ఇద్దరి మధ్య కాస్త గ్యాప్‌ ఉండేది. కానీ.. తాజా ఫోటోలలో ఆ చిన్న గ్యాప్‌ కూడా కనిపిండం లేదు. అంతేకాదు గుత్తా జ్వాలకు విశాల్‌ ముద్దు పెడుతున్న ఫోటో కూడా ఉండటం విశేషం. ఇంకేం ఉంది.. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని గుసగుసలు మొదలయ్యాయి.

క్యూట్‌ అండ్‌ హాట్‌

క్యూట్‌ అండ్‌ హాట్‌

జ్వాల షేర్‌ చేసిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతున్నాయి. స్వయంగా జ్వాలనే ఫొటోలు షేర్ చేయడంతో ఇద్దరి మధ్య ఎఫైర్‌ నిజమే అని నెటిజన్లు తెగ కామెంట్‌ చేస్తున్నారు. 'ఈ జోడి ఎంతో క్యూట్‌ అండ్‌ హాట్‌' అని నెటిజన్ కామెంట్ చేయగా.. 'విడిపోయి ఒకటి అవుతున్న జంట' అని మరో నెటిజన్‌ సరదాగా పేర్కొన్నాడు. విష్ణు విశాల్‌ తన భార్య రజనీతో విడిపోవడానికి జ్వాలనే కారణమని ఓ నెటిజన్‌ మండిపడ్డాడు.

గతంలో ప్రేమ వివాహం

గతంలో ప్రేమ వివాహం

గుత్తా జ్వాల ప్రేమించి పెళ్లి చేసుకున్న మరో బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు చేతన్‌ ఆనంద్‌తో పలు విభేదాల కారణంగా విడిపోయారు. వీరిద్దరూ విడిపోవడానికి టీమిండియాకు చెందిన ఓ మాజీ క్రికెటర్‌ అని రూమర్స్‌ వచ్చాయి. అయితే ఈ వార్తలను గుత్తా జ్వాలా కొట్టిపారేశారు. మరోవైపు హీరో విష్ణు విశాల్‌ గత జూన్‌లో తన భార్య రజనీతో విడిపోయిన విషయం తెలిసిందే. విష్ణు తమిళంలో ఇప్పటివరకూ 14 సినిమాల్లో నటించాడు.

క్రీడా అకాడమీ ఏర్పాటు

క్రీడా అకాడమీ ఏర్పాటు

గుత్తా జ్వాల ఇటీవలే హైదరాబాద్ నగరంలో క్రీడా అకాడమీని ఏర్పాటు చేశారు. 'జ్వాల గుత్తా అకాడమీ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌' పేరుతో అకాడమీని ప్రారంభించారు. అకాడమీకి సంబంధించిన లోగోను గత డిసెంబర్ నెలలో ఢిల్లీలో కేంద్ర మాజీ మంత్రి రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ, బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌, రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ ఆవిష్కరించారు. మొదటగా 14 బ్యాడ్మింటన్‌ కోర్టులతో అకాడమీని ప్రారంభించనున్నారు. అనంతరం మరికొన్ని క్రీడా మైదానాలు ఏర్పాటు చేసి అకాడమీ ద్వారా శిక్షణ అందించనున్నారు.

Story first published: Thursday, January 2, 2020, 9:38 [IST]
Other articles published on Jan 2, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+