సచిన్‌పై వ్యాఖ్యలు: షరపోవాకు జ్వాలా గుత్తా బాసట
హైదరాబాద్: భారత క్రికెట్ దిగ్గజం, భారతరత్న సచిన్ టెండూల్కర్ తెలియక పోవడం పెద్ద నేరమా అంటూ భారత షట్లర్ జ్వాలా గుత్తా ప్రశ్నించింది. "సచినా? అతనెవరో నాకు తెలియదు" అంటూ టెన్నిస్ స్టార్ షరపోవా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.
షరపోవాపై టెండూల్కర్ అభిమానులు విరుచుకుపడ్డారు. అది పెద్ద గాలి దుమారంగా మారింది. ఈ నేపథ్యంలో భారత షట్లర్ జ్వాల గుత్తా దీనికి మరింత ఆజ్యం పోసింది. సచిన్ తెలియకపోవడంలో తప్పేముంది అని ప్రశ్నించింది.

షరపోవా వ్యాఖ్యలను అనవసరంగా వివాదాస్పదం చేస్తున్నారని వెనకేసుకొచ్చింది. క్రికెట్ కేవలం 12 దేశాల్లో మాత్రమే ఆడతారని, అమెరికన్లకయితే అసలు క్రికెట్ అంటేనే తెలియదని తెలిపింది. అదే టెన్నిస్ అయితే 200 దేశాల్లో, బ్యాడ్మింటన్ 150 దేశాల్లో తెలుసని చెప్పింది. ఇ
లాంటి పరిస్థితుల్లో సచిన్ టెండూల్కర్ తెలవదని షరపోవా అనడం తప్పేమీ కాదని స్పష్టం చేసింది. జ్వాలా గుత్తా మననసులో ఏమీ పెట్టుకోకుండా మాట్లాడి పలుమార్లు చిక్కుల్లో పడిన విషయం తెలిసిందే. తాజా వ్యాఖ్యలతో ఆమె ఎటువంటి చిక్కుల్లో పడుతుందో వేచి చూడాల్సింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications