Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మీటూ ఉద్యమం: తానూ గొంతెత్తిన జ్వాలా గుత్తా

#MeToo: Gutta Jwala Open Ups On Me Too Campaign
Jwala Gutta speaks of mental harassment, selection bias; calls it her me too moment

న్యూ ఢిల్లీ: దేశ వ్యాప్తంగా 'మీ టూ'ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తోంది. బాలీవుడ్‌, టాలీవుడ్‌తోపాటు వివిధ రంగాలకు చెందిన మహిళలు వివిధ సందర్భాల్లో వేధింపులకు గురయ్యామంటూ బాహాటంగా చెప్పుకొంటున్నారు. ఈ జాబితాలోకి ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల కూడా చేరిపోయింది. తాను కూడా వేధింపులకు గురయ్యానని.. కాకపోతే అవి మానసిక వేధింపులు అంటూ జ్వాల వరుస ట్వీట్‌లు చేశారు.

బ్యాడ్మింటన్‌కు రాజీనామా చేయడానికి ఓ కారణం

‘మీటూ ద్వారా నాకు ఎదురైన మానసిక వేధింపులు గురించి వెల్లడించాలని అనుకుంటున్నాను. అతను 2006లో చీఫ్‌ అయ్యాడు. అప్పటి నుంచి నన్ను మానసిక వేధింపులకు గురి చేశాడు. నేషనల్‌ చాంపియన్‌ అయిన నన్ను జట్టు నుంచి బయటకు పంపించాడు. బ్యాడ్మింటన్‌కు రాజీనామా చేయడానికి ఇది కూడా ఓ కారణం. బయటకు పంపించడమే కాకుండా నాతో పాటు ఆడే నా పార్ట్‌నర్స్‌ని కూడా బెదిరించాడు.'

ఒలంపిక్స్‌ తరువాత కూడా వేధింపులు

'నేను రియో ఒలంపిక్స్‌ నుంచి వచ్చిన తరువాత కూడా ఈ వేధింపులు కొనసాగాయి. నేను ఎవరితో అయితే కలిసి మిక్స్‌డ్ ఆడతానో తనను కూడా బెదిరించారు. దాంతో నేను జట్టు నుంచి బయటకు వచ్చేశాను. ప్రపంచ నం.9గా ఉన్న నేను ఎంతో క్షోభ అనుభవించాల్సి వచ్చింది.'అంటూ జ్వాల ట్వీట్‌ చేశారు.

కొద్ది రోజులు జట్టులో స్థానం లేకుండా

మరో ట్వీట్‌లో ‘నాకు జాతీయ స్థాయిలో పోటీల్లో స్థానం దక్కకుండా చేసింది కూడా అతడే. కొద్ది రోజుల పాటు నాకు జట్టులో స్థానం లేకుండా చేశాడు' అంటూ ఆయన పేరు చెప్పకుండా గుత్తా జ్వాల ట్వీట్ చేసింది. బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి బయటపెట్టడంతో భారత్‌లో ‘మీటూ'ఉద్యమం ఓ ఉప్పెనలా ఎగసిపడుతోంది.

సింధు, సైనా ప్రాధాన్యం ఇస్తూ..

సింధు, సైనా ప్రాధాన్యం ఇస్తూ..

బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, సైనా నెహ్వాల్ వంటి సింగిల్స్ క్రీడాకారులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ... డబుల్స్‌లో సంచలన విజయాలు సాధించిన వారిని మాత్రం సరిగ్గా పట్టించుకోవడం లేదనే కారణంగా గుత్తా జ్వాల బ్యాడ్మింటన్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాదీ క్రీడాకారిణి అయిన ఈ ‘ఫైర్‌ బ్రాండ్‌' తన డబుల్స్ కెరీర్లో ఎన్నో గొప్ప విజయాలు సాధించారు.

Story first published: Wednesday, October 10, 2018, 11:23 [IST]
Other articles published on Oct 10, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+