Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేనిలా అవడానికి కారణం జ్వాలా గుత్తానే : అశ్విని పొన్నప్ప

Jwala Gutta helped me dream big, reveals Ashwini Ponnappa

హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ చరిత్రలో అశ్విని పొన్నప్ప ఒక అధ్యాయం. డబుల్స్ గేమ్‌లో తనతో పాటు ఆడుతున్న సిక్కి రెడ్డితో ఆమెకున్న పరిచయాన్ని మీడియాతో పంచుకుంది. అంతకుముందు జ్వాలా గుత్తాతో తనకు మధ్య జరిగిన అనుభవాలను కూడా వివరించింది.

డబుల్స్‌లో మెరుగైన స్థాయిలో రాణించగల అశ్విని పొన్నప్ప మహేశ్ భూపతితో కలిసి 2010 కామన్ వెల్త్ క్రీడల్లో స్వర్ణాన్ని కూడా గెలుచుకున్నారు. 2011 ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాత జోడీ అయిన అశ్విని, జ్వాలా కలిసి విజేతగా నిలిచారు. 2016 వరకు కొనసాగిన వీరి జోడీ ఆ తర్వాత సిక్కిరెడ్డితో అశ్వినితో జతకట్టడంతో విడిపోయింది.

నాకు జ్వాలాతో ఆడినప్పుడు ఎంతవరకు ఆడాలో నిర్ధిష్టంగా ఉండేది. కోర్టులో చాలా వరకు నా పరిధిలోనే ఉండేది. కానీ, సిక్కిరెడ్డితో ఆడేటప్పుడు దానికి విరుద్ధంగా ఉంది. సిక్కిరెడ్డి మంచి మూవర్. కోర్టు మొత్తం చక్కగా చుట్టేయగలదు.

'అశ్వినితో ఆడేటప్పుడే పెద్ద పెద్ద కలలు కనడం నేర్చుకున్నా. తనతో ఆడుతున్నప్పుడే చాలా విషయాలు నేర్చుకునేదాన్ని. దాంతోపాటుగా కాలం గడుస్తున్నకొద్దీ నేను కూడా మంచి అనుభవమున్న క్రీడాకారిణి అయ్యానని భావిస్తున్నాను' అని అశ్విని పేర్కొంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, January 17, 2018, 14:51 [IST]
Other articles published on Jan 17, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+