Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎన్నాళ్లీ సవతి తల్లి ప్రేమ?: బాయ్‌పై జ్వాలా గుత్తా అక్కసు

షిల్లాంగ్: హైదరాబాదీ స్టార్ షట్లర్ గుత్తా జ్వాల మరోసారి జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య (బాయ్)పై మరోసారి మండిపడింది. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ డబుల్స్ ఆటగాళ్లపై బాయ్ సవతి తల్లి ప్రేమ చూపిస్తోందనీ, ఇప్పటికైనా వైఖరిని మార్చుకోవాలని జ్వాలా గుత్తా సూచించింది.

డబుల్స్ క్రీడాకారిణిగా తాను అంతర్జాతీయ టోర్నమెంట్‌లలో ఎన్నో పతకాలు సాధించాను. అయినా సరే డబుల్స్ విభాగాన్ని బాయ్ అసలు పట్టించుకోవడం లేదన్నారు. బ్యాడ్మింటన్‌లో సింగిల్ షట్లర్లకు ఇస్తున్న ప్రాధాన్యతలో కొంతైనా డబుల్స్ షట్లర్లకు ఇవ్వడం లేదన్నారు.

Jwala Gutta blasts Badminton Association of India over double shuttlers

డబుల్స్ క్రీడాకారిణిలపై ఎన్నాళ్లీ సవతితల్లి ప్రేమ చూపిస్తారు? మీ పద్దతి మార్చుకోవాల్సిన అవసరముంది అని దక్షిణాసియా క్రీడల్లో ఆడుతున్న జ్వాలా గుత్తా మీడియా ముందు బాయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అశ్వినీ, నేను మినహా డబుల్స్‌ విభాగంలో ఎవరూ లేరన్నారు.

దీనిపైనే నాబ బాధంతా. మనం చైనాతో పోటీ పడుతున్నామని చెప్పారు. చైనాలో కనీసం ఆరుగురు మహిళ, పురుషుల, మిక్సిడ్ డబుల్స్ జంటలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. మన దగ్గర మా జంట మాత్రమే ఉండగా, మిగతా అన్ని దేశాల్లోనూ డబుల్స్ జంటలు ఉన్నాయన్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+