హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు జ్వాలా గుత్తా, అశ్విని పొన్నప్పల జోడీ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ ఫ్రీ క్వార్టర్స్‌కు చేరింది. మహిళల విభాగంలో జరిగిన ఈ పోటీలో రెండో రౌండ్‌లో చెన్-జంగ్ జోడిపై 21-10, 21-18 తో విజయం సాధించారు.

ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ నుంచి భారత క్రీడాకారుడు పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో కశ్యప్ ఓటమి పాలయ్యారు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ లో తన ప్రత్యర్థి, వియత్నాం క్రీడాకారుడు టియోన్ మిన్ చేతిలో ఓటమి పాలయ్యాడు. 21-17, 13-21, 18-21 తేడాతో కశ్యప్ పై మిన్ గెలుపొందాడు.
ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రిక్వార్టర్స్‌కు ప్రణయ్ అర్హత సాధించారు. ఇక మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో హైదరాబాద్ క్రీడాకారిణి పీవి. సింధు 11-21, 21-17, 21-16తో జార్స్‌ఫెల్డ్ (డెన్మార్క్)పై విజయం సాధించిన ఫ్రీ క్వార్టర్స్ పైనల్లోకి అడుగుపెట్టింది.
ఆరంభంలో 1-6తో వెనకుబడిన సింధు తొలి గేమ్‌ను కోల్పోయింది. రెండో గేమ్‌లో కుదురుకున్న సింధు 5-2 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక మూడో గేమ్‌లో సింధు 13-9తో విజయం సాధించింది. ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో మూడో సీడ్ కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశాడు.
మైఖెల్ ఫారిమన్ (ఆస్టేలియా)తో జరిగిన తొలి రౌండ్‌లో శ్రీకాంత్ 24 నిమిషాల్లో 21-10, 21-13తో విజయం సాధించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. రెండో రౌండ్‌ను సు జెన్ హావో (చైనీస్ తైపీ)తో శ్రీకాంత్ ఆడనున్నాడు.