Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతనితో డేటింగ్‌లో ఉన్నా.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా: గుత్తా జ్వాల

Jwala Gutta Accepts Her Relationship With Vishnu Vishal, Talks About Wedding Plans

హైదరాబాద్: ప్రముఖ బ్యాడ్మింటన్‌ స్టార్ గుత్తా జ్వాల, కన్నడ నటుడు విష్ణు విశాల్‌తో డేటింగ్‌లో ఉన్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆమధ్య కాలంలో ఇద్దరు కలిసి తీసుకున్న సన్నిహిత చిత్రాలు కూడా ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టాయి. అయితే వీరి బంధంపై గుత్తా జ్వాల ఇటీవలే స్పష్టత ఇచ్చారు. విష్ణు విశాల్‌ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు.

త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా:

త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా:

'అవును మేమిద్దరం డేటింగ్‌లో ఉన్నాం. ఇందులో దాచుకోవడానికి ఏమీ లేదు. త్వరలోనే మా పెళ్లి జరగబోతోంది. వివాహ తేదీ ఖరారైన తర్వాత, లేదా పెళ్లి ఏర్పాట్లు మొదలు పెట్టినప్పుడు మేమే అధికారికంగా ప్రకటిస్తాం' అని గుత్తా జ్వాల చెప్పారు. మరోవైపు గుత్తా జ్వాలాతో తమ సంబంధం గురించి విశాల్ కూడా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. తాము ఏడాదిగా స్నేహితులమని, తరచూ కలుస్తుంటామని చెప్పారు.

మిస్‌ అవుతున్నా:

మిస్‌ అవుతున్నా:

గుత్తా జ్వాల మార్చి 28న విష్ణు విశాల్‌తో సన్నిహితంగా తీసుకున్న ఫొటోల్ని ట్విటర్‌లో షేర్‌ చేశారు. దేశంలో కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రియుడికి దూరం కావడంతో జ్వాలకు రోజులు భారంగా గడుస్తున్నట్టున్నాయి. దీంతో 'మిస్సింగ్‌ మై బూ' అని జ్వాల ట్వీట్‌ చేసారు. దీనికి ఆయన రీట్వీట్‌ చేస్తూ... 'ఫర్వాలేదు.. ఇప్పుడు సామాజిక దూరం ముఖ్యం. అందరి కోసం ప్రార్థిద్దాం' అని కామెంట్‌ చేశారు.

 చేతన్ ఆనంద్‌తో పెళ్లి:

చేతన్ ఆనంద్‌తో పెళ్లి:

గుత్తా జ్వాల ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే సహచర ఆటగాడు చేతన్ ఆనంద్‌తో ప్రేమలో పడింది. చాలా కాలం పాటు ప్రేమాయణం సాగించిన తర్వాత వీళ్లిద్దరూ 2005లో వివాహం చేసుకున్నారు. ఆరేళ్ల వైవాహిక జీవితం తర్వాత 2011లో విడిపోయారు. ఇక, అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే జీవనం సాగిస్తోంది. అయితే టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌తో డేటింగ్ చేసినట్లు ఆ మధ్యలో వార్తలు వినిపించాయి.

రజనీతో వివాహం:

రజనీతో వివాహం:

మరోవైపు కాస్ట్యూమ్‌ డిజైనర్‌ రజనీ నటరాజ్‌తో 2011లో విష్ణు విశాల్‌ పెళ్లి జరిగింది. కొన్ని కారణాల వల్ల 2018లో వీరు విడాకులు తీసుకున్నారు. వారికి ఆర్య అనే మూడేళ్ల కుమారుడున్నాడు. విడాకుల గురించి విష్ణు విశాల్‌ మీడియాతో మాట్లాడుతూ... 'నేను గ్రహించిన ఒక విషయం ఏంటంటే.. లోకంలో కచ్చితత్వం లేదు. ఏదైనా ఎప్పుడైనా జరగొచ్చు. నేను పక్కా అని అనుకున్నది నా వివాహం, అది ఇప్పుడు లేదు. ఏమైందో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు' అని అన్నారు.

Story first published: Wednesday, April 1, 2020, 9:11 [IST]
Other articles published on Apr 1, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+