ఫోటోలు వైరల్: పెళ్లితో ఒక్కటైన సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్

హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ వివాహా బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, అతికొద్దిమంది అతిధులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ సమక్షంలో శుక్రవారం ఈ ఇద్దరి పెళ్లి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను సైనా నెహ్వాల్ ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.
డిజైనర్ లెహంగాలో సైనా నెహ్వాల్ పెళ్లిలో చాలా అందంగా కనిపించారు. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. గత ఎనిమిదేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. డిసెంబర్ 16న సైనా నెహ్వాల్, కశ్యప్‌ల వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది.

సైనా పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్
ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. గత ఎనిమిదేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు శుక్రవారం ఉదయం పారుపల్లి కశ్యప్ ఇంట్లో ఉపనయనం కార్యక్రమాలు పూర్తయ్యాయి. దీనికి సంబంధించిన ఫొటోలను కశ్యప్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న సంగతి తెలిసిందే.

సందడిగా మారిన ఇద్దరి ఇళ్లు
పెళ్లి సందర్భంగా బంధువులు, శ్రేయోభిలాషుల రాకతో వీరివురి ఇళ్లు సందడిగా మారాయి. కాగా, డిసెంబర్ 16న హైటెక్ సిటీలోని నోవాటెల్ హోటల్‌లో సైనా నెహ్వాల్, కశ్యప్‌ల వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది. ఈ వెడ్డింగ్ రిసెప్షన్‌కు బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ సందడి చేయనున్నారు.

డిసెంబర్ 16న నోవాటెల్ హోటల్‌లో రిసెప్షన్
ఇప్పటికే కేటీఆర్, చిరంజీవి, కోచ్ పుల్లెల గోపీచంద్, రణ్‌వీర్‌సింగ్, దీపిక, ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ధోని, సమంత, రకుల్‌ప్రీత్ సింగ్, కీర్తిసురేష్, మిథాలీరాజ్, పీవీ సింధు, అశ్విని పొన్నప్ప తదితర ప్రముఖులను సైనా-కశ్యప్ జంట ఆహ్వానించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications