Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చైనీస్ తైపీ టోర్నీ నుంచి తప్పుకున్న సింధు.. శ్రీకాంత్‌లు

Jayaram, Sourabh to lead Indian charge at Chinese Taipei Open

న్యూఢిల్లీ: స్టార్ ప్లేయర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్.. చైనీస్‌తైపీ ఓపెన్ నుంచి తప్పుకున్నారు. ఈనెలలోనే రెండు సూపర్ 750 వరల్డ్ టూర్ ఈవెంట్స్ (డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్) ఉండటంతో వీళ్లు పై నిర్ణయం తీసుకున్నారు. వీళ్ల గైర్హాజరీతో మంగళవారం నుంచి జరిగే చైనీస్‌తైపీ టోర్నీలో అజయ్ జయరామ్, సౌరభ్ వర్మపైనే భారీ ఆశలు నెలకొన్నాయి. కాలిపిక్క కండర గాయం నుంచి కోలుకున్న జయరామ్.. ఇటీవల జరిగిన వియత్నాం ఓపెన్‌లో ఫైనల్‌కు వరకు చేరుకోవడం అంచనాలు పెరిగాయి.

తొలిరౌండ్‌లో జయరామ్.. హషిరు షిమోనో (జపాన్)తో, సౌరభ్.. లీ చాయ్ హో (చైనీస్‌తైపీ)తో తలపడనున్నారు. మరో మ్యాచ్‌లో రాహుల్ యాదవ్.. లు చాయ్ హంగ్ (తైవాన్)తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. మహిళల సింగిల్స్‌లో సాయి ఉత్తేజిత.. చియాంగ్ యింగ్ లీ (చైనీస్‌తైపీ), ముగ్గా ఆగ్రే... ఏడోసీడ్ సోనియా చీయాతో, శ్రీకృష్ణప్రియా.. లిన్ యింగ్ చున్‌తో తలపడనున్నారు. డబుల్స్‌లో తరుణ్ కోనా-లిమ్ వా.. నాలుగోసీడ్ ఓంగ్ యి సిన్-టియో యిను ఎదుర్కొంటారు.

ఇంతకుముందు జరిగిన టోర్నీ కొరియా ఓపెన్‌లోనూ పీవీ సింధు... వరుస టోర్నీలతో అలసిపోవడం వల్ల కొరియా ఓపెన్‌కు దూరమైంది. తెలుగు స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ కూడా కొరియా ఓపెన్‌కు దూరంగా ఉంటున్నాడు. కొరియా ఓపెన్ 2018 టైటిల్ ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో బరిలోకి దిగిన సైనా నెహ్వాల్ .. ఫ్రీ క్వార్టర్స్‌లో ఓటమికి గురై అయింది.

అయితే ఈ టోర్నీ అనంతరం తన ప్రేమ విషయాన్ని బయటపెట్టి పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రేమ వివాహం చేసుకోబోతున్నానని.. ఇటీవలే వీరి ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించి పెళ్లికి పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పెళ్లికి సంబంధించి వివాహం తేదీని కూడా ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి. సైనా నెహ్వాల్ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం సైనా-కశ్యప్‌ జోడీ డిసెంబర్‌ 16న వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

Story first published: Tuesday, October 2, 2018, 12:49 [IST]
Other articles published on Oct 2, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+