హైదరాబాద్: జపాన్ ఓపెన్‌లో పీవీ సింధు పోరాటం ముగిసింది. ఈ టోర్నీలో నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన పీవీ సింధు ప్రీక్వార్టర్స్‌లో జపాన్ క్రీడాకారిణి నొజొమి ఒకుహర చేతిలో ఓటమి పాలైంది. ఇటీవల ముగిసిన కొరియా ఓపెన్ ఫైనల్లో ఒకుహరపై విజయం సాధించిన సింధు ఈసారి ఓడింది.
రెండు వరుస గేమ్‌ల్లో 18-21, 8-21తో ఓటమిపాలై మ్యాచ్‌ను చేజార్చుకుంది. హోరాహోరీగా సాగిన తొలి గేమ్‌లో సింధు ప్రత్యర్థికి పోటీ ఇచ్చింది. తొలి గేమ్ ఆరంభంలో సింధు ఆధిక్యాన్ని సంపాదించినా... అనంతరం 8-8వద్ద ఒకుహర పాయింట్లు సమం చేసింది. ఆ తర్వాత సింధు వరుసగా పాయింట్లను కోల్పోయింది.

దీంతో ఒకుహర 15-11 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అనంతరం తిరిగి పుంజుకున్న సింధు 15-15 వద్ద పాయింట్లను సమం చేసింది. చివరకు తొలి గేమ్‌ను 18-21తో ఓడిపోయింది. ఇక ఏకపక్షంగా సాగిన రెండో గేమ్‌లో సింధు 8-21 తేడాతో కోల్పోయి మ్యాచ్‌ను చేజార్చుకుంది.
ఇప్పటి వరకు వీరిద్దరు 9 సార్లు తలపడగా ఒకుహర ఐదు సార్లు, సింధు నాలుగు సార్లు విజయం సాధించారు. ఇదిలా ఉంటే గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్, కిదాంబి శ్రీకాంత్ క్వార్టర్స్ చేరుకున్నారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ప్రణవ్ చోప్రా-సిక్కి రెడ్డి జోడీ క్వార్టర్స్ చేరుకోగా పొన్నప్ప జోడీ ఓటమి పాలైంది.