Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జపాన్‌ ఓపెన్‌.. సెమీస్‌లో ప్రణీత్‌ ఓటమి

Japan Open 2019: Sai Praneeth carshes out after semi-final defeat to Kento Momota

టోక్యో: జపాన్‌ ఓపెన్‌ వరల్డ్‌టూర్‌-750 టోర్నమెంట్‌లో భారత్‌ పోరాటం ముగిసింది. భారత స్టార్ షట్లర్ సాయి ప్రణీత్‌ సెమీస్‌లో ఓటమిపాలయ్యాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో జపాన్‌ క్రీడాకారుడు, ప్రపంచ నంబర్‌వన్‌ కెంటో మెమోటో చేతిలో 18-21, 12-21 తేడాతో ఓడి ప్రణీత్‌ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. కేవలం 45 నిమిషాలలో మ్యాచ్‌ ముగిసింది.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

ప్రపంచ నంబర్‌వన్‌ కెంటో మెమోటో ముందు ప్రపంచ 23 వ ర్యాంకర్ ప్రణీత్‌ నిలవలేకపోయాడు. తొలిగేమ్‌ ప్రారంభంలో 3-1తో ప్రణీత్‌ ఆధిక్యం సాధించాడు. కానీ.. కెంటో పుంజుకుని 21-18తో తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో ప్రణీత్‌ 9-6తో మళ్లీ ఆధిక్యంలోకి వచ్చినా.. కెంటో వరుసగా ఆరు పాయింట్లు సాధించి పోటీలోకి వచ్చాడు. చివరకు కెంటో 21-12తో రెండో గేమ్‌ను గెలిచి ఫైనల్లోకి ప్రవేశించాడు. ఈ ఓటమితో జపాన్‌ ఓపెన్‌లో ప్రణీత్‌, భారత్ పోరాటం ముగిసింది.

శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో సాయి ప్రణీత్‌ 21-12, 21-15 తేడాతో టామీ సుగియార్తో (ఇండోనేసియా)పై సునాయాసంగా గెలిచి సెమీ ఫైనల్‌కు చేరుకున్నాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రణీత్‌ 21-13, 21-16 తేడాతో కాంటా సునెయామ (జపాన్‌)పై గెలిచాడు. ప్రణీత్‌ వరుస సెట్లలో విజయం సాధించాడు. కేవలం 45 నిమిషాల్లో మ్యాచ్ ముగించాడు. అయితే కీలక సెమీఫైనల్లో మాత్రం చేతులెత్తేశాడు.

మహిళల సింగిల్స్‌లో భాగంగా శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో భారత స్టార్ షట్లర్‌ పీవీ సింధు 18-21, 15-21 తేడాతో అకానే యమగుచి (జపాన్‌) చేతిలో ఓడిపోయింది. దీంతో జపాన్ ఓపెన్‌లో పీవీ సింధు క్వార్టర్‌ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. తొలి గేమ్‌ ఆరంభంలో సింధు ఆధిక్యంలో నిలిచినప్పటికీ.. ఒత్తిడికి లోనై 18-21 తేడాతో కోల్పోయింది. ఇక రెండో గేమ్‌ నువ్వా నేనా అన్నట్లు సాగినా.. యామగుచి పైచేయి సాధించి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

Story first published: Saturday, July 27, 2019, 13:56 [IST]
Other articles published on Jul 27, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+