Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జపాన్‌ ఓపెన్‌.. క్వార్టర్స్‌లో సింధు, ప్రణీత్‌

Japan Open 2019: PV Sindhu, Sai Praneeth enter quarters

టోక్యో: జపాన్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-750 టోర్నమెంట్‌లో భారత స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, సాయి ప్రణీత్‌ దూసుకెళుతున్నారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఐదో సీడ్ సింధు 11-21, 21-10, 21-13 తేడాతో అయా ఒహోరి (జపాన్‌)పై విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరుకుంది. తొలి గేమ్‌ను కోల్పోయిన సింధు.. అనంతరం పుంజుకుని రెండో గేమ్‌లో గెలిచింది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఒహోరికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకుంది.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సాయి ప్రణీత్‌ క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. ప్రణీత్‌ 21-13, 21-16 తేడాతో కాంటా సునెయామ (జపాన్‌)పై గెలిచి ముందడుగేసాడు. ప్రణీత్‌ వరుస సెట్లలో విజయం సాధించాడు. కేవలం 45 నిమిషాల్లో ప్రణీత్‌ మ్యాచ్ ముగించాడు. సింధు క్వార్టర్స్‌లో చెన్ జియావో జిన్, అకానే యమగుచిలో ఒకరితో తలపడనుంది.

బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఐదో సీడ్ సింధు 21-9, 21-17 తేడాతో అన్‌సీడెడ్ క్రీడాకారిణి హాన్‌ యుయె (చైనా)పై గెలిచింది. 37 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో సింధు ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రణయ్.. భారత్‌కే చెందిన ప్రపంచ పదో ర్యాంకర్‌ శ్రీకాంత్‌ను 13-21, 21-11, 22-20 తేడాతో ఓడించాడు.

Story first published: Thursday, July 25, 2019, 14:34 [IST]
Other articles published on Jul 25, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+