Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జపాన్‌ ఓపెన్‌.. తొలి రౌండ్‌లోనే కిదాంబి శ్రీకాంత్‌ ఓటమి

Japan Open 2019: HS Prannoy Stuns Kidambi Srikanth In First Round

టోక్యో: పతకం సాధిస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న భారత స్టార్ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ తీవ్రంగా నిరాశపరిచాడు. జపాన్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-750 టోర్నమెంట్‌ నుండి శ్రీకాంత్‌ నిష్క్రమించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో తొలి రౌండ్‌లో భారత్‌కే చెందిన హెచ్‌ఎస్ ప్రణయ్‌ చేతిలో ఓడిపోయాడు. ఎనిమిదో సీడ్‌ శ్రీకాంత్‌ను ప్రణయ్‌ 13-21, 21-11, 21-20 తేడాతో ఓడించి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

తొలి గేమ్‌లో శ్రీకాంత్‌ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. కానీ రెండో గేమ్‌లో పుంజుకున్న ప్రణయ్‌ సత్తా చాటాడు. ఇక నిర్ణయాత్మకమైన మూడో గేమ్‌లో ఇద్దరూ పోటాపోటీగా తలపడ్డారు. 20-18తో ప్రణయ్‌ ఆధిక్యంలో ఉన్న సమయంలో శ్రీకాంత్‌ అద్భుతంగా పోరాడి 20-20తో స్కోరుని సమం చేశాడు. ఒత్తిడిని జయించిన ప్రణయ్‌ గేమ్‌తో పాటు మ్యాచ్ సొంతం చేసుకున్నాడు. ప్రణయ్‌ రెండో రౌండ్‌లో డెన్మార్క్‌కు చెందిన రాస్‌మస్ జెమ్కేతో పోటీపడనున్నాడు.

మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత జోడీ ప్రణవ్‌-సిక్కిరెడ్డికి పరాభవం ఎదురైంది. జెంగ్‌ సి వె-హువాంగ్‌ యా కియోంగ్‌ (చైనా) చేతిలో తొలి రెండు గేమ్‌ల్లోనే 11-21, 14-21తో ఓడారు. బుధవారం జరిగే మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో హాన్‌ యుయె (చైనా)తో హైదరాబాద్ స్టార్ పీవీ సింధు తలపడనుంది. ఇండోనేషియా ఓపెన్‌లో రన్‌రప్‌గా నిలిచిన సింధు.. జపాన్‌ ఓపెన్‌ టైటిల్‌పై కన్నేసింది.

భమిడిపాటి సాయి ప్రణీత్‌ శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 23వ ర్యాంకర్‌ సాయిప్రణీత్‌ 21-17, 21-13తో ప్రపంచ 11వ ర్యాంకర్‌ కెంట నిషిమోటో (జపాన్‌)పై విజయం సాధించాడు. 41 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కీలకదశలో విజృంభించిన ప్రణీత్‌.. విజయం సాధించి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరాడు. ఇక గురువారం జరిగే ప్రిక్వార్టర్‌ ఫైనల్లో జపాన్‌కు చెందిన కాంటా సునెయామతో సాయిప్రణీత్‌ ఆడతాడు.

Story first published: Wednesday, July 24, 2019, 17:07 [IST]
Other articles published on Jul 24, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+