ఇండోనేషియా ఓపెన్: ముగిసిన సింధు, హెచ్ఎస్ ప్రణయ్ పోరాటం

హైదరాబాద్: జకార్తా వేదికగా జరుగుతున్న ఇండోనేషియా ఓపెన్ టోర్నీ నుంచి భారత షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ నిష్క్రమించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో షీ యుకీ (చైనా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 17-21, 18-21 తేడాతో ఓటమి పాలయ్యాడు.
పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో షీ యుకీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. ప్రిక్వార్టర్‌లో చైనాకే చెందిన వాంగ్ జు వుయ్‌పై అద్భుత ప్రదర్శనతో విజయం సాధించిన హెచ్ఎస్ ప్రణయ్ ఈ మ్యాచ్‌లో ఆ మేరకు రాణించలేకపోయాడు.
పీవీ సింధు నిష్క్రమణ:
మరోవైపు మహిళల సింగిల్స్‌లో జరిగిన మ్యాచ్‌లో పీవీ సింధు 21-14, 21-15తేడాతో హి బింగ్ జియావో (చైనా) ఓటమి పాలైంది. మరో భారత షట్లర్ సైనా నెహ్వాల్ కూడా రౌండ్-16లోనే ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో ఇండోనేషియా ఓపెన్‌లో భారత షట్లర్ల పోరాటం ముగిసింది.
Story first published: Friday, July 6, 2018, 17:48 [IST]
Other articles published on Jul 6, 2018
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications