For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండోనేసియా ఓపెన్‌.. సింధు, శ్రీకాంత్‌ శుభారంభం

Indonesia Open 2019: Top Indian shuttlers PV Sindhu, Kidambi Srikanth enter 2nd round

దాదాపు నెల రోజుల విరామం తర్వాత బరిలోకి దిగిన భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌ ఇండోనేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-1000 టోర్నమెంట్‌లో శుభారంభం చేశారు. మరో ఇద్దరు సింగిల్స్‌ షట్లర్లు సాయి ప్రణీత్‌, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ తొలి రౌండ్‌లోనే వెనుదిరిగి నిరాశ పరిచారు.

బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ఐదో సీడ్‌ సింధు 11-21, 21-15, 21-15తో జపాన్‌కు చెందిన అయా ఒహొరిపై విజయం సాధించింది. అయా ఒహోరిపై సింధుకిది వరుసగా ఏడో విజయం. సింధు తర్వాతి రౌండ్‌లో మియా బ్లిచ్‌ఫెల్ట్‌ (డెన్మార్క్‌)తో తలపడనుంది. పురుషుల సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్‌ శ్రీకాంత్‌ 21-14, 21-13తో జపాన్‌ ఆటగాడు కెంటా నిషిమొటోను అలవోకగా ఓడించాడు. ప్రీక్వార్టర్‌ ఫైనల్లో హాం కాంగ్‌కు చెందిన కా లాంగ్‌ ఆగ్నస్‌ను శ్రీకాంత్‌ ఢీకొంటాడు.

సాయి ప్రణీత్‌ 15-21, 21-13, 10-21తో వాంగ్‌ వింగ్‌ కి విన్సెంట్‌ (హాంకాంగ్‌) చేతిలో ఓడగా.. ప్రణయ్‌ 21-19, 18-21, 20-22తో చైనా స్టార్‌ షట్లర్ రెండో సీడ్‌ షి యుకీ చేతిలో పోరాడి ఓడాడు. ఇక మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-అశ్వినీ పొన్నప్ప 13-21, 11-21తో ఇండోనేసియా జోడి విన్నీ ఒక్తావినా-టాన్‌టోవీ అహ్మద్‌ చేతిలో చిత్తుగా ఓడిపోయారు. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సుమీత్‌ రెడ్డి-మను అత్రి జోడీ 11-21, 17-21తో లియావో మిన్‌ చున్‌-సు చింగ్‌ హెంగ్‌ (చైనీస్‌ తైపీ) ద్వయం చేతిలో పరాజయం పాలయ్యారు.

గురువారం జరిగే మిక్స్‌డ్‌ డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ జెంగ్‌ సి వె-హువాంగ్‌ యా కియోంగ్‌ (చైనా) జోడీతో సిక్కి రెడ్డి-ప్రణవ్‌ చోప్రా (భారత్‌) ద్వయం... పురుషుల డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ మార్కస్‌ గిడియోన్‌-కెవిన్‌ సంజయ (ఇండోనేసియా) జోడీతో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి (భారత్‌) జంట తలపడతాయి.

Story first published: Thursday, July 18, 2019, 8:25 [IST]
Other articles published on Jul 18, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+