Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సైనా శ్రమించి, గెలిచి, ఫైనల్‌లో నిలుచుంది

Indonesia Masters 2018: Saina Nehwal sends Ratchanok Intanon packing in straight games to enter final

హైదరాబాద్: ఇండోనేసియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్స్‌లో పీవీ సింధుపై రెండు వరుస గేమ్‌ల్లో విజయం సాధించి సెమీస్‌ చేరిన సైనా అదే జోరును కొనసాగించింది. థాయ్‌లాండ్‌ క్రీడాకారిణి, నాలుగో సీడ్‌ రచనోక్‌తో సెమీస్‌లో తలపడిన సైనా రెండు వరుస సెట్లలో విజయం సాధించింది.

49 నిమిషాల పాటు హోరాహోరీగా జరిగిన ఈ పోరు ఆద్యంతం నువ్వానేనా అన్నట్లు సాగింది. గాయం నుంచి కోలుకుని ఇటీవలే కోర్టులో అడుగుపెట్టిన సైనా ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనా ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. చివరకు సైనా 21-19, 21-19తో మ్యాచ్‌ను గెలుచుకుని ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో ఈ ఏడాది పాల్గొన్న తొలి టోర్నమెంట్‌లోనే సైనా ఫైనల్‌ చేరడంతో భారత అభిమానుల్లో సంతోషం వ్యక్తమైంది.

49 నిమిషాలపాటు సాగిన ఈ పోరులో విజయం కోసం సైనా హోరాహోరీగా పోరాడాల్సి వచ్చింది. తై జుయంగ్, బింగ్ జియావోల మధ్య జరిగే సెమీఫైనల్ విజేతతో మన హైదరాబాదీ సైనా ఫైనల్లో తలపడనుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, January 28, 2018, 14:07 [IST]
Other articles published on Jan 28, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+