Commonwealth Games : మన బంగారానికి బంగారం.. గాయాన్ని అధిగమించి గోల్డ్ మెడల్ అందించిన పీవీ సింధు..!


మన తెలుగు తేజం, మన బంగారం, మన గోల్డ్ గర్ల్ పీవీ సింధు మరోసారి మువ్వన్నెల జెండాను రెపరెపలాడింది. బ్యాడ్మింటన్ వుమెన్స్ సింగిల్స్ ఫైనల్లో గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఆమె కామన్వెల్త్ గేమ్స్‌లో ఇప్పటికే రజతం, కాంస్యం సాధించింది. తాజాగా స్వర్ణం సాధించి.. తన పతకాల పెట్టేలో దీన్ని కూడా యాడ్ చేసుకుంది. ఈ 27ఏళ్ల స్టార్ షట్లర్ గోల్డ్ మెడల్ మ్యాచులో అరివీర భీకరంగా చెలరేగింది. కెనడా బ్యాడ్మింటన్ స్టార్ మిచెల్ లీను వరుస గేమ్‌లలో మట్టికరిపించింది. తద్వారా మరో సెట్ మిగిలి ఉండగానే అద్వితీయ విజయాన్ని అందుకుంది. పీవీ సింధు మ్యాచులో ఎడమ చీలమండపై గాయమైన కూడా అకుంఠిత పోరాటాన్ని సలిపింది. గోల్డ్ కోస్ట్‌లో తనను ఓడించిన మిచెల్ లీను దెబ్బకు దెబ్బ తీసి సింధు లెక్క సరిచేసింది. ఇక గెలిచిన అనంతరం తన ట్రేడ్ మార్క్ సెలెబ్రేషన్స్ చేసుకుంది. ఆనందంగా ఆకాశం వైపు చూసింది. అలాగే ఆమె తన కోచ్ పార్క్ టే సాంగ్‌ని కౌగిలించుకుంది. ఇక సింధు గెలుపుతో మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన అభిమానులు కేరింతలతో సంబరాలు చేసుకున్నారు. కామన్వెల్త్ గేమ్స్‌లో సింధుకు ఇది 3వ సింగిల్స్ పతకం.
గాయాన్ని లెక్క చేయకుండా
గోల్డ్ కోస్ట్ కామన్ వెల్త్ గేమ్స్‌లో తోటి భారతీయ ప్లేయర్ సైనా నెహ్వాల్ చేతిలో ఓటమిపాలై ఆమె రజతాన్ని సాధించింది. ఇక బర్మింగ్ హమ్‌లో సింధు జైత్రయాత్రకు ఎదురులేకుండా పోయింది. ఫైనల్లో మిచెల్ లీనుతో ఆమెకు పోటీ కన్ఫామ్ అయినప్పుడే సింధు విజయం దాదాపు ఖాయమనిపించింది. ఎందుకంటే వీరిద్దరు తలపడినప్పుడు 8-2తేడాతో సింధు విజయాల్లో ఆధిపత్యం కనబర్చింది. అయితే 2014 గ్లాస్గోలో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్‌లో పసిడి గెలిచిన మిచెల్ లీను తక్కువ అంచనా వేయకుండా సింధు పోరాడింది. మ్యాచ్‌కు ముందు సింధుకు ఎడమ చీలమండకు గాయమైనట్లు తెలిసి సపోర్టింగ్ స్టాఫ్ కాస్త కంగారు పడ్డా ఆమె గాయాన్ని లెక్కచేయలేదు.
ఇంజూరీ దెబ్బతీస్తుందనిపించినా..
ఇకపోతే తొలి సెట్లో ఇద్దరు పోటాపోటీగా తలపడ్డారు. ఒకానొక దశలో సింధుకంటే మిచెల్ అన్ని వైవిధ్య షాట్లతో కోర్టు నలుమూలల తన ప్రతాపాన్ని చూపించింది. కాసేపటికే 7-7 పాయింట్లతో మ్యాచ్ తీవ్ర ఉత్కంఠగా సాగింది. సింధును ఇంజూరీ దెబ్బతీసేలా కన్పించింది. అయితే అనూహ్యంగా పుంజుకున్న సింధు 11-8తో మళ్లీ లీడ్లోకి వచ్చేసింది. మిడ్ గేమ్ లెవల్ మ్యాచ్ టైంకు సింధు 17-12తో తన ఆధిక్యాన్ని కొనసాగించింది. ఆ తర్వాత మిచెల్ లీకు ఎలాంటి అవకాశమివ్వకుండా తొలి సెట్‌ను 21-15తేడాతో సింధు ఒడిసిపట్టింది.
లాంగ్ ర్యాలీలో లీ గెలవడంతో మళ్లీ ఉత్కంఠ
రెండో సెట్లో సింధు తొలి నుంచి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. గేమ్ ఇంటర్వెల్ సమయానికి 11-6తో లీడ్‌లోకి వచ్చేసింది. స్టాండ్లో ప్రేక్షకులు సైతం ఆమెను చీర్స్ చేస్తుండడం కూడా ఆమెకు ప్లస్ అయిందనుకోవచ్చు. అయితే లీ మళ్లీ పుంజుకుంది. 57షాట్ల లాంగ్ ర్యాలీని పోరాట పటిమతో గెలుచుకుంది. దీంతో మళ్లీ మ్యాచ్ టఫ్ అయిపోయింది. అయినప్పటికీ సింధు 13-10తేడాతో ఆధిక్యంలోనే ఉంది. సింధు కాస్త అలిసిపోయినట్లు కన్పించింది. తన అలుపును మళ్లీ లెక్క చేయని సింధు దూకుడు కనబర్చింది దీంతో మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. సెకండ్ సెట్ 21-13తేడాతో గెలుపొందింది. తద్వారా స్వర్ణకాంతులను పండించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications