Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేటి నుంచి ఇండియా ఓపెన్ మొదలవబోతోంది

Indian Open: Focus on Saina, Sindhu

హైదరాబాద్: ఇండోనేషియా ఓపెన్ టోర్నీ ముగిసి రెండు రోజులైందో లేదో అప్పుడే మరో టోర్నీ సిద్ధమైపోయింది. ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీకి రంగం సిద్ధమైంది. ఈ టోర్నీలో స్వదేశ ఆటగాళ్లైన సింధు, సైనాపైనే అందరి కళ్లు ఉన్నాయి. నేటి నుంచి జరిగే ఈ టోర్నీలో భారత టాప్ షట్లర్లందరూ బరిలోకి దిగుతున్నారు. సైనా నెహ్వాల్, పీవీ సింధు ఫేవరెట్లుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

మంగళవారం ప్రారంభంకానున్న ఈ టోర్నీలో సింధు టాప్‌ సీడ్‌గా, సైనా నాలుగో సీడ్‌గా పాల్గొంటున్నారు. 2015లో విజేతగా నిలిచిన సైనా.. ఇండోనేషియా మాస్టర్స్‌లో ఫైనల్‌ చేరడంతో ఆమెపై అంచనాలు పెరిగాయి.

రియో ఒలింపిక్స్ తర్వాత ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బందిపడిన సైనా దాన్ని అధిగమించినట్లే కనిపిస్తున్నది. ఇండోనేసియా మాస్టర్స్‌లో రన్నరప్‌గా నిలువడమే ఇందుకు నిదర్శనం. నాలుగోసీడ్‌గా బరిలోకి దిగుతున్న సైనా.. తొలిరౌండ్‌లో సోఫీ డాహ్ (డెన్మార్క్)తో తలపడనుంది.

గతేడాది ఇండియా ఓపెన్‌ టైటిల్‌తో సత్తాచాటిన సింధు తొలి రౌండ్లో నటాలియా రోడ్‌ (డెన్మార్క్‌)తో పోటీపడుతుంది. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో సోఫీ డాల్‌ (డెన్మార్క్‌)తో సైనా తలపడుతుంది. క్వార్టర్స్‌లో సింధు ఐదోసీడ్ బీవెన్ జాంగ్‌ను ఎదుర్కోవచ్చు.

క్వార్టర్‌ఫైనల్ వరకు సులువైన డ్రానే ఉన్నా.. సెమీస్‌లో మాత్రం మాజీ ప్రపంచ చాంపియన్ రచనోక్ ఇంతనోన్‌తో కఠిన పరీక్ష ఎదురుకానుంది. డ్రా ప్రకారం సెమీస్‌ వరకు ప్రత్యర్థుల్ని ఓడిస్తే.. సైనా, సింధు ఫైనల్లో ఎదురుపడతారు.

శ్రీకాంత్‌పైన భారీ అంచనాలు:
గత సీజన్‌లో నాలుగు టైటిల్స్ నెగ్గి సంచలనం సృష్టించిన కిడాంబి శ్రీకాంత్‌పై ఈసారి భారీ అంచనాలు నెలకొన్నాయి. కాలి గాయంతో చైనా ఓపెన్, హాంకాంగ్ ఓపెన్‌కు దూరంగా ఉన్న అతను దుబాయ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో సత్తా చాటలేకపోయాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు ఈనెలలో జరిగిన ఇండోనేసియా మాస్టర్స్‌కూ దూరంగా ఉన్నాడు.

2014లో విజేతగా నిలిచిన శ్రీకాంత్.. శుభారంభంతో సీజన్‌ను మొదలుపెట్టాలని భావిస్తున్నాడు. లీ చియుక్ యీ (హాంకాంగ్)తో జరిగే మ్యాచ్‌తో అతను టోర్నీని మొదలుపెట్టనున్నాడు. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ శ్రీకాంత్ గెలిస్తే.. ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ విక్టర్ అక్సెల్‌సన్‌తో తలపడే అవకాశాలున్నాయి. సాయి ప్రణీత్, హెచ్‌ఎస్ ప్రణయ్, పారుపల్లి కశ్యప్, అజయ్ జయరామ్, సౌరభ్ వర్మ, సమీర్ వర్మ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, January 30, 2018, 9:20 [IST]
Other articles published on Jan 30, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+